PM Modi Poland Visit :భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలెండ్‌కు చేరుకున్నారు. ఆ దేశ రాజధాని వార్సాలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. భారత్, పోలెండ్ మధ్య ఉన్న దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా మోదీ ప్రస్తుతం అక్కడ పర్యటించారు. అయితే, గత 45 ఏళ్లలో భారత ప్రధాని పోలెండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 1979లో చివరిసారిగా నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలెండ్‌కు వెళ్లారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పోలాండ్ అధ్యక్షుడు, ప్రధాన మంత్రితో భేటీ కానున్నారు. పొలాండ్‌కు చెందిన వ్యాపార దిగ్గజాలు, పర్యావరణవేత్తలతోనూ మోదీ చర్చలు జరపనున్నారు. భారత సంతతి ప్రజలను కలవనున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరుగుతన్న ఈ పర్యటన ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సెంట్రల్ యూరప్‌లో పోలాండ్ కీలక ఆర్థిక భాగస్వామి అని తెలిపారు. పోలెండ్‌లో ప్రవాస భారతీయులg స్వాగతం పలికిన ఫొటోలను మోదీ పోస్ట్ చేశారు.
అయితేపోలెండ్‌లో రెండు రోజులపాటు పర్యటించనున్న మోదీ, అక్కడ నుంచి ఆ తర్వాత ఉక్రెయిన్ వెళ్లనున్నారు. ఆగస్టు 23న ఓ స్పెషల్ ట్రైన్లో సుమారు 10 గంటల పాటు ప్రయాణించి కీవ్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యి ఆ తర్వాత తిరిగి మళ్లీ రైలులోనే పోలెండ్ చేరుకుంటారు. అక్కడ పర్యటన ముగించుకొన్నాక మోదీ తిరిగి స్వదేశానికి తిరిగొస్తారు.