తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ - వరుసగా రెండోసారి బాధ్యతలు - పాక్​కు ప్రధానిగా షెహబాజ్ షరీఫ్

Pakistan Pm Shehbaz Sharif : పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా షెహబాజ్​ షరీఫ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. సోమవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Pakistan Pm Shehbaz Sharif
Pakistan Pm Shehbaz Sharif

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 2:57 PM IST

Updated : Mar 3, 2024, 4:15 PM IST

Pakistan PM Shehbaz Sharif : పాక్‌ ముస్లింలీగ్‌ - నవాజ్‌ (పీఎంఎల్‌ - ఎన్‌) పార్టీ అగ్రనేత షెహబాజ్‌ షరీఫ్‌ (72) రెండోసారి పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. సోమవారం రాష్ట్రపతి భవనంలో 33వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 336 సభ్యుల ఉన్న జాతీయ అసెంబ్లీలో ఆదివారం ప్రధానమంత్రి ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించారు. అందులో పీఎంఎల్​-ఎన్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన షెహబాజ్​ 201 ఓట్లు సాధించారు. షెహబాజ్​కు పోటీగా జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్​కు చెందిన పార్టీ నుంచి ఒమర్ అయూబ్​ఖాన్​కు 92 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఓటింగ్ సమయంలో గందరగోళం
ఓటింగ్ సందర్భంగా పార్లమెంటులో పాకిస్థాన్‌ తెహ్రీక్‌- ఎ- ఇన్సాఫ్‌ (పీటీఐ) మద్దతుగల చట్టసభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొంది. ఇమ్రాన్​ ఖాన్​కు మద్దతుగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళన మధ్యే ఓటింగ్ నిర్వహించి విజయం సాధించిన షెహబాజ్​ను ప్రధానిగా స్పీకర్ ప్రకటించారు. షరీఫ్​ మొదటిసారి 2022 ఏప్రిల్​ నుంచి 2023 ఆగస్టు వరకు సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించారు.

'పెద్ద సవాలే ఉంది'
ఈ క్రమంలో తనను ప్రధానిగా చేసినందుకు అందరికి షెహబాజ్​ కృతజ్ఞలు తెలిపారు. ' నాపై విశ్వాసం ఉంచి నున్ను ప్రధానిగా ఎన్నుకున్నందుకు అందరికీ నా ధన్యవాదములు. పాకిస్థాన్​ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే ప్రతిభావంతులైన వ్యక్తులు ఈ పార్లమెంటులో ఉన్నారు. వీరిలో జర్నలిస్టుల, మేధావులు, రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ఇప్పుడు మన ముందు పెద్ద సవాలే ఉంది. ఈ పని కష్టమే కానీ, పాకిస్థాన్ విధిని మార్చాలి అని అందరం కలిసి అనుకుంటే అది సాధ్యం అవుతుంది. ' అని షెహబాజ్ అన్నారు.

ఉమ్మడి అభ్యర్థిగా షెహబాజ్
ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో 265 స్థానాలకుగాను పాకిస్థాన్ తెహ్రీక్​- ఎ- ఇన్సాఫ్ (పీటీఐ) 93 చోట్ల విజయం సాధించింది. పీఎంఎల్- ఎన్ 72, పీపీపీ-52, ముత్తాహిదా క్వామీ మూవ్​మెంట్ 15, ఇతర పార్టీలు 8 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవటం వల్ల పీఎంఎల్ -ఎన్, బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పీపీపీ కలిసి కూటమిగా ఏర్పాడ్డాయి. సుదీర్ఘ చర్చలు అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించి, ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్​కు ప్రకటించాయి. తాజా ఓటింగ్​లో మెజారిటీని సాధించి రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.

కుమార్తె కోసం ప్రధాని పదవి త్యాగం!- సైన్యానికి తలొగ్గిన నవాజ్ షరీఫ్

'బైడెన్ వద్దు- ఒబామా భార్య అయితే ఓకే'- డెమొక్రాట్ల అభ్యర్థిగా మిషెల్​కు జై!

Last Updated : Mar 3, 2024, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details