తెలంగాణ

telangana

ETV Bharat / international

సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి - 44 మంది మృతి- సైనికులే అధికం! - Israel Attack On Syria - ISRAEL ATTACK ON SYRIA

Israel Attack On Syria : హమాస్​తో యుద్ధం మొదలైన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్ దళాలు సిరియాపై విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో మొత్తం 44మంది మృతి చెందారు. ఇందులో 36 మంది సైనికులు మరణించారు.

Israel Attack On Syria
Israel Attack On Syria

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 6:35 AM IST

Updated : Mar 30, 2024, 7:00 AM IST

Israel Attack On Syria: హమాస్‌తో యుద్ధం కొనసాగిస్తున్న వేళ సిరియాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఆ దేశ అతిపెద్ద నగరమైన అలెప్పోపై జరిగిన ఈ దాడుల్లో దాదాపు 44 మంది మృతి చెందారు. వీరిలో 36 మంది సిరియా సైనికులేనని ఓ యుద్ధ పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలయ్యాక సిరియా సైన్యానికి ఈ స్థాయి ప్రాణనష్టం వాటిల్లడం ఇదే మొదటిసారని తెలిపింది.

ఇరాన్​ మద్దతు గ్రూపులే టార్గెట్
అలెప్పో విమానాశ్రయం సమీపంలోని హెజ్‌బొల్లాకు చెందిన క్షిపణి నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొంది. ఇరాన్ అనుకూల గ్రూపులకు చెందిన రక్షణ కర్మాగారాలను కూడా టార్గెట్‌ చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనను సిరియా సైన్యం కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్‌తో పాటు స్థానిక తిరుగుబాటు దళాలు ఏకకాలంలో దాడులు చేశాయని పేర్కొంది. ఈ దాడిలో మరణించిన వారిలో 36 మంది సిరియా సైనికులు ఉండగా, ఏడుగురు హెజ్​బొల్లా సభ్యుడు, సిరియా పౌరుడు ఉన్నారని తెలిపింది.

సిరియాపై తాజా దాడుల గురించి ఇజ్రాయెల్‌ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. కొన్ని గంటల ముందే సిరియా రాజధాని డమస్కస్‌ శివార్లలోనూ ఓ నివాస భవనం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ వైమానిక దాడిలో ఇద్దరు పౌరులు మృతి చెందారని స్థానిక మీడియా తెలిపింది. హెజ్‌బొల్లా సహా ఇరాన్‌ మద్దతుగల సాయుధ బృందాలకు కీలక స్థావరమైన సయిదా జైనాబ్‌ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు అబ్జర్వేటరీ వెల్లడించింది.

Gaza Ceasefire Un Security Council : రంజాన్‌ సందర్భంగా గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఇటీవలే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి డిమాండ్​ చేసింది. దీంతోపాటు బందీలను హమాస్ విడుదల చేయాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. మొత్తం 15 సభ్య దేశాల్లో 14 తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా వీటో జారీ చేయకుండా తీర్మానం ఆమోదం పొందేందుకు ఓటింగ్​కు దూరంగా ఉంది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

99 డ్రోన్లతో రష్యా భీకర దాడులు- ఉక్రెయిన్‌లో కరెంట్​ కట్​! - Russia Attack On Ukraine

ఈస్టర్ వేడుక​కు వెళ్తుండగా లోయలో పడిన బస్సు- 45మంది భక్తులు మృతి - South Africa Bus Accident

Last Updated : Mar 30, 2024, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details