Indian Students In USA : అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారని తాజాగా విడుదలైన ఓపెన్ డోర్స్ నివేదిక ద్వారా వెల్లడైంది. అమెరికాలో 2023-24 విద్యా సంవత్సరంలో ఏకంగా 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారని, గత 15 ఏళ్లలో ఇదే అత్యధికమని ఓపెన్ డోర్స్ సంస్థ పేర్కొంది. ఈ విధంగా అమెరికాకు అత్యధికంగా విద్యార్థులను పంపిన దేశంగా భారత్ నిలిచిందని తెలిపింది.
ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ప్రకారం
- 2022-23 విద్యా సంవత్సరంలో అమెరికాకు వెళ్లి చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో చైనా స్టూడెంట్స్ ఎక్కువగా ఉండగా, వారి తరువాతి స్థానంలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. కానీ 2023-24 విద్యా సంవత్సరంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
- 2022-23లో యూఎస్‌లో 2,68,923 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే 2023-24 విద్యా సంవత్సరంలో యూఎస్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 3,31,602కు పెరిగింది. 2022-23 విద్యా సంవత్సరంతో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
- ఓపెన్ డోర్స్ రిపోర్ట్ 2024పై యూఎస్ ఎంబసీ షేర్ చేసిన నోట్ ప్రకారం, యూఎస్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌లో భారతీయ విద్యార్థులు 29 శాతం వరకు ఉన్నారు. అంటే సంఖ్య పరంగా చూస్తే భారతీయ విద్యార్థులే ప్రథమ స్థానంలో ఉన్నారు.
- తాజా రిపోర్ట్‌లోని అధికారిక డేటా ప్రకారం, 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాకు ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను పంపిన టాప్ 5 దేశాలు ఏమిటంటే? అవి:
1. భారత్ (3,31,602)