తెలంగాణ

telangana

ట్రంప్​పై కాల్పులు జరిపిన 20ఏళ్ల యువకుడు- సీక్రెట్ సర్వీస్​తో కలిసి FBI దర్యాప్తు - Donald Trump Was Attacked

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 2:05 PM IST

Trump Incident Shooter : Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డ దుండగుడిని ఎఫ్‌బీఐ గుర్తించింది. పెన్సిల్వేనియాలోని బెతెల్‌ పార్క్‌కు చెందిన మాథ్యూ క్రూక్‌గా ధ్రువీకరించింది.

Trump Incident Shooter
Trump Incident Shooter (Associated Press)

Trump Incident Shooter :అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నం యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని ఎఫ్‌బీఐ తాజాగా గుర్తించింది. 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌గా ధ్రువీకరించింది. పెన్సిల్వేనియాలోని బెతెల్‌ పార్క్‌కు చెందిన వ్యక్తిగా తెలిపింది. ప్రభుత్వ ఓటింగ్‌ రికార్డుల ప్రకారం, అతడు రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదాడిగా నమోదు చేసుకున్నాడు. 2021 సంవత్సరంలో 15 డాలర్లను డెమొక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసీవ్‌ టర్న్‌ఔట్‌ ప్రాజెక్టకు విరాళంగా ఇచ్చాడు. ప్రస్తుతం క్రూక్స్‌ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

దుండగుడు క్రూక్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. కొన్ని మీడియా సంస్థలు సైతం అనుమానితుడిగా పేర్కొంటూ అతడి ఫొటోలను ముందే ప్రసారం చేశాయి. మరోవైపు కాల్పులకు ముందు అతడు రికార్డు చేసినదిగా పేర్కొంటున్న ఓ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతోంది. అందులో 'రిపబ్లికన్‌ పార్టీని, ట్రంప్‌ను నేను ద్వేషిస్తున్నా'నని అతడు చెబుతున్నట్లుగా ఉంది.

ట్రంప్‌ ప్రసంగించడానికి ఏర్పాటు చేసిన వేదికకు 130 గజాల దూరం నుంచి దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఓ తయారీ కేంద్రం పైకప్పున మాటువేసి ఈ కాల్పులకు తెగబడ్డట్లు స్పష్టమవుతోంది. డొనాల్డ్ ట్రంప్​ను కాల్చి గాయపరిచేంతగా ఏఆర్​శ్రేణి సెమీ ఆటోమేటిక్‌ రైఫిల్​తో సాయుధుడు ఎలా సభావేదిక దగ్గర్లోకి చేరుకున్నాడని దానిపై యూఎస్ సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేస్తోంది. దుండగుడు ఏ ఆయుధం వాడాడు? ఇవన్నీ తెలుసుకునేపనిలో నిమగ్నమైంది.

కాగా, సాయుధుడు హత్యకు గురయ్యే ముందు వేదికపైకి కాల్పులు జరపడం ఆశ్చర్యకరంగా ఉందని ఎఫ్​బీఐ స్పెషల్ ఏజెంట్ ఇన్​ఛార్జ్ కెవిన్ రోజెక్ తెలిపారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్​ను మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్న నేపథ్యంలో ఆయనపై ఈ దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ట్రంప్​పై హత్యాయత్నం కేసును ఎఫ్​బీఐ సీరియస్​గా తీసుకుని విచారణ చేపడుతోంది.

'వారితో కలిసి పనిచేస్తున్నాం'
డొనాల్డ్ ట్రంప్​పై జరిగిన దాడిపై దర్యాప్తు చేయడానికి తమ డిపార్ట్‌మెంట్, సీక్రెట్ సర్వీస్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్​తో కలిసి పనిచేస్తోందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల భద్రత చూసుకోవడం తమ బాధ్యతని పేర్కొన్నారు. ట్రంప్ పై దాడిని ఖండిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ట్రంప్ భద్రత విషయంలో వేగంగా చర్యలు తీసుకున్న సీక్రెట్ సర్వీస్‌ ను అభినందించారు. ట్రంప్​పై జరిగిన కాల్పులకు సంబంధించి సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటిల్​ను విచారణకు హాజరుకావాలని కోరారు హౌస్ ఓవర్ సైట్ కమిటీ ఛైర్మన్ జేమ్స్ కమెర్. మరోవైపు, ట్రంప్​పై దాడి ఘటనపై హౌస్ పూర్తి విచారణ జరుపుతుందని రిపబ్లికన్ హౌస్ స్వీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. అమెరికా ప్రజలు నిజం తెలుసుకోవటానికి అర్హులని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details