తెలంగాణ

telangana

ETV Bharat / international

స్కూల్​ బస్​లో మంటలు- 23 మంది మృతి - Fire Accident In Thailand - FIRE ACCIDENT IN THAILAND

Fire Accident In Thailand : థాయ్​లాండ్​లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 23 మంది మరణించారు. వీరిలో 20 మంది విద్యార్థులేనని తెలిసింది.

Fire Accident In Thailand
Fire Accident In Thailand (ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2024, 1:00 PM IST

Updated : Oct 1, 2024, 2:36 PM IST

Fire Accident In Thailand : థాయ్​లాండ్​ రాజధాని బ్యాంకాక్​లో పాఠశాల బస్సులో మంటలు చెలరేగి 23 మంది మరణించారు. మృతుల్లో 20 మంది విద్యార్థులు కాగా ముగ్గురు ఉపాధ్యాయులు అని తెలిసింది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు.

ప్రమాదానికి గురైన బస్సు సెంట్రల్​ ఉథై థని రాష్ట్రం నుంచి 44 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో మంగళవారం బ్యాంకాక్​ వస్తోంది. బ్యాంకాక్​ శివార్లలోని పథుమ్ థని దగ్గరకు చేరుకునేసరికి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తానికి వ్యాపించాయి. అనేక మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సులోని విద్యార్థులు ఎలిమెంటరీ, జూనియర్ హైస్కూల్​ తరగతుల వారని తెలిసింది.

ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని, మృతుల సంఖ్యపై ఇప్పుడే స్పష్టమైన ప్రకటన చేయలేమని థాయ్​లాండ్ హోంమంత్రి అనుతిన్​ చర్నివిరకుల్​ తెలిపారు. ప్రమాదం నుంచి డ్రైవర్ ప్రాణాలతో బయటపడినా, భయపడి పారిపోయి ఉంటాడని చెప్పారు.

టైరు పేలడమే కారణమా?
పాఠశాల బస్సు టైరు పేలిపోయి, వాహనం అదుపు తప్పి డివైడర్​ను ఢీకొందని, అప్పుడే మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు థాయ్​లాండ్ రవాణా శాఖ మంత్రి సూర్య జుంగ్రుంగ్రుంగ్​​కిట్​కు చెప్పారు.

బస్సు ప్రమాదంపై థాయ్​లాండ్ ప్రధాని పేటోంగ్​టార్న్ షిన్వంతర విచారం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం క్షతగాత్రుల వైద్యుఖర్చులు భరిస్తుందని, బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తుందని ప్రకటించారు.

Last Updated : Oct 1, 2024, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details