Democrats Vice President Candidate: అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న భారత, ఆఫ్రికన్ సంతతి కమలా హారిస్, ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను ఎన్నుకున్నారు. 60 ఏళ్ల వాల్జ్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకోవడంలో, హారిస్ తన ప్రచారాన్ని ఎగువ మిడ్‌వెస్ట్‌లో బలపరచాలని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్ష రాజకీయాల్లో ఎగువ మిడ్‌వెస్ట్ కీలకమైన ప్రాంతంగా భావిస్తారు.
డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి ఖరారు- టిమ్ వాల్జ్‌ను ఎంచుకున్న కమల హారిస్ - Democrats Vice President Candidate - DEMOCRATS VICE PRESIDENT CANDIDATE
Democrats Vice President Candidate: డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఎంపికయ్యారు. ఆయనను ప్రెసిడెంట్ క్యాండిడేట్ కమలా హారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకున్నారు.
Published : Aug 6, 2024, 7:00 PM IST
|Updated : Aug 6, 2024, 7:48 PM IST
నెబ్రాస్కా రాష్ట్రంలోని వెస్ట్ పాయింట్ అనే చిన్న పట్టణంలో వాల్జ్ పుట్టి, పెరిగారు. రాజకీయాల్లోకి రాకముందు సోషల్ టీచర్‌గా, ఫుట్‌బాల్ కోచ్‌గా పని చేశారు. 24 ఏళ్లపాటు మిలిటరీలో సేవలందించారు. 2006 నుంచి డెమొక్రాటిక్ పార్టీ తరఫున చురుగ్గా పనిచేస్తున్నారు. 2018లో "వన్ మిన్నెసోటా" థీమ్‌పై గవర్నర్‌గా పోటీ చేశారు. హెన్నెపిన్ కౌంటీ కమీషనర్ జెఫ్ జాన్సన్‌ను 11 పాయింట్ల తేడాతో ఓడించారు. 2022లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై దాదాపు 8 పాయింట్ల తేడాతో గెలిచి తిరిగి మరోసారి గవర్నర్‌గా ఎన్నికయ్యారు. మిన్నెసోటాలో ప్రతిష్టాత్మకమైన డెమోక్రటిక్ ఎజెండాను రూపొందించడంలో వాల్జ్ కీలకంగా వ్యవహరించారు.