తెలంగాణ

telangana

ETV Bharat / international

కమలా హారిస్​కు సొంత పార్టీలోనే గట్టి పోటీ- వారిపై పైచేయి సాధిస్తేనే అభ్యర్థిగా ఖరారు- ఎవరి బలమెంత? - Us Election 2024 - US ELECTION 2024

Democratic President Contenders : ఎన్నికలకు సరిగ్గా 4 నెలల ముందు బైడెన్ డెమొక్రటిక్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి నామినిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ స్థానాన్ని దక్కించుకోవటానికి పలువురు సిద్ధంగా ఉన్నారు. వారెవరంటే ?

Democratic President Contenders
Democratic President Contenders (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 12:00 PM IST

Democratic President Contenders: డెమొక్రటిక్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా వైదొలుగుతున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ప్రకటించడం వల్ల ఆ స్థానాన్ని దక్కించుకునేదెవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే పలువురు కీలక నేతలు డెమొక్రటిక్‌ అభ్యర్థిత్వనాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రేసులో ఉపాధ్యక్షురాలు కమలా కమహా హారిస్ ముందున్నారు. ఇప్పటికై బైడెన్‌ కూడా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. అయితే డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వారెవరో తెలుసుకుందాం.

కమలా హారిస్

  • కమలా హారిస్(59) కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జన్మించారు.
  • అమెరికా తొలి మహిళ ఉపాధ్యక్షురాలిగా ఎంపికై చరిత్ర సృష్టించారు.
  • కమలా హరిస్‌ తండ్రి ఆర్థికవేత్త. తల్లి క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్‌.
  • కమలా హారిస్‌ను బైడెన్‌ నిర్భయ పోరాట యోధురాలిగా అభివర్ణించారు.
  • హోవార్డ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ చేశారు.
  • రెండుసార్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు.
  • లాస్ ఏంజిల్స్ న్యాయవాది డగ్లస్ ఎమ్‌హాఫ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు.
కమలా హారిస్ (Associated Press)

జేబీ ప్రిట్జ్కర్

  • జేబీ ప్రిట్జ్‌కర్ ప్రస్తుతం ఇల్లినాయీ గవర్నర్‌గా ఉన్నారు.
  • అమెరికాలో అత్యంత ధనిక రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు.
  • ప్రిట్జ్‌కర్‌ నికర ఆస్తుల విలువ 3.4 బిలియన్‌ డాలర్లు
  • అమెరికా రాజ్యాంగ సవరణలకు మద్దతు ఇచ్చారు.
  • "థింక్ బిగ్ అమెరికా" అనే నినాదంతో ప్రజల మద్దతు పెంచుకున్నారు.
జేబీ ప్రిట్జ్కర్ (Associated Press)

గ్రెచెన్ విట్మెర్

  • గ్రెచెన్‌ విట్మెర్‌ మిషిగన్ గవర్నర్‌గా ఉన్నారు.
  • శాసనసభలో ఒకటిన్నర దశాబ్దంపాటు పనిచేశారు.
  • డెమొక్రటిక్ పార్టీలో వేగంగా ఎదిగిన మహిళా నేతగా గుర్తింపు పొందారు.
  • డెమొక్రటిక్ పార్టీలో అత్యంత ప్రభావవంతమైన స్పీకర్‌గా ఉన్నారు.
  • అబార్షన్ హక్కులపై గళం విప్పి మహిళలను ఆకట్టుకున్నారు.
  • అధ్యక్ష అభ్యర్థిత్వానికి బలమైన పోటీదారుగా ఉన్నారు.
  • జాతీయ రాజకీయ కార్యాచరణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు విట్మెర్‌
గ్రెచెన్ విట్మెర్ (Associated Press)

గావిన్ న్యూసమ్

  • గావిన్ న్యూసమ్‌ కాలిఫోర్నియా గవర్నర్‌గా ఉన్నారు.
  • 1995లో రాజకీయాల్లోకి ప్రవేశించారు.
  • 2004లో స్వలింగ జంటలకు వివాహ లైసెన్సును జారీ చేసి అందరి దృష్టి ఆకర్షించారు.
  • బైడెన్‌ను బలమైన నమ్మకస్థుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
  • గావిన్​కు కాలిఫోర్నియా అంతటా రెస్టారెంట్లు, రిసార్ట్‌లు ఉన్నాయి.
గావిన్ న్యూసోమ్ (Associated Press)

జోష్ షాపిరో

  • జోష్‌ షాపిరో పెన్సిల్వేనియా గవర్నర్‌గా ఉన్నారు.
  • పెన్సిల్వేనియాలో ఎదుగుతున్న రాజకీయ స్టార్‌గా ఆయనను చూస్తారు.
  • ట్రంప్ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని ఓడించి గవర్నర్‌గా రెండోసారి అధికారం చేపట్టారు.
  • రెండుసార్లు అటార్నీ జనరల్‌గా, ఒకసారి గవర్నర్‌గా చేశారు.
  • హమాస్‌పై పోరులో ఇజ్రాయెల్‌కు సంఘీభావం ప్రకటించారు.
జోష్ షాపిరో (Associated Press)

రాయ్ కూపర్

  • ఉత్తర కరొలినా డెమొక్రటిక్ గవర్నర్‌గా ఉన్నారు.
  • ఆరు సాధారణ ఎన్నికల్లో విజయం కేతనం ఎగరేశారు.
  • పరిపాలన, చట్టసభలపై మంచి అవగాహన ఉంది.
  • ప్రభుత్వ విద్య, అబార్షన్ హక్కుల కోసం పోరాడారు.
  • రాయ్ కూపర్ న్యాయ విద్యను అభ్యసించారు.
రాయ్ కూపర్ (Associated Press)

ఆండీ బెషీర్

  • ఆండీ బెషీర్‌ కెంటకీ గవర్నర్‌గా ఉన్నారు.
  • ట్రంప్ ఆమోదించిన రిపబ్లికన్‌ అభ్యర్థిని ఓడించి స్టార్‌గా గుర్తింపు పొందారు.
  • గత ఏడాది రెండోసారి కూడా ఎన్నికల్లో గెలుపొందారు.
  • అబార్షన్ హక్కులకు మద్దతు ఇచ్చారు.
  • కెంటకీలో అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు.
  • బెషీర్ 2015లో అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు.
ఆండీ బెషీర్ (Associated Press)

మార్క్ కెల్లీ

  • మార్క్‌ కెల్లీ అరిజోనాకు చెందిన సెనెటర్.
  • వ్యోమగామిగా పనిచేసి దేశం దృష్టిని ఆకర్షించారు.
  • కెల్లీ గత ఎన్నికల్లో ఇతర డెమొక్రాట్ల కంటే ఎక్కువ ఓట్లను సంపాదించారు.
  • రాజకీయ హింసకు కెల్లీ కుటుంబం బలైపోయింది.
  • గన్‌ నియంత్రణకు కెల్లీ పోరాటం చేస్తున్నారు.
  • నాసాలో చేరడానికి ముందు గల్ఫ్ యుద్ధంలో పాల్గొన్నారు.
  • స్పేస్ షటిల్‌లో మూడు మిషన్లకు నేతృత్వం వహించారు.
మార్క్ కెల్లీ (Associated Press)

కమలా హారిస్ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ - ఇంకా ఏమీ తేల్చని ఒబామా, పెలోసీ - Us Elections 2024

'బైడెన్​ అత్యంత చెత్త అధ్యక్షుడు, కమలా హారిస్‌ను ఓడించడం ఇంకా ఈజీ'- ట్రంప్‌ - Trump Slams Kamala Harris

ABOUT THE AUTHOR

...view details