తెలంగాణ

telangana

ETV Bharat / international

హాలీవుడ్​లో కార్చిచ్చు విధ్వంసం! ఇళ్లు ఖాళీచేసిన సెలెబ్రిటీలు- వందలాది నిర్మాణాలు దగ్ధం - CALIFORNIA WILDFIRES HOLLYWOOD

లాస్​ఎంజెలెస్​లోని విస్తరిస్తున్న కార్చిచ్చు - వెయ్యికి పైగ నిర్మాణాలు అగ్నికి ఆహుతి - ఇళ్లను ఖాళీ చేసిన హాలీవుడ్​ ప్రముఖులు - ఫెడరల్ ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు జో బైడెన్

California Wildfires Hollywood
California Wildfires Hollywood (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : 20 hours ago

California Wildfires Hollywood :అమెరికా లాస్​ఎంజెలెస్​లో చెలరేగిన కార్చిచ్చులు తీవ్రరూపం దాల్చాయి. బుధవారం రాత్రి హాలీవుడ్​ హిల్స్​లో చెలరేగిన రాకాసి మంటలు ఐదుగురిని బలితీసుకున్నాయి. అక్కడి ప్రఖ్యాత ప్రదేశాలను ప్రమాదంలో పడేశాయి. కార్చిచ్చు ధాటికి లక్షమందికి పైగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సివచ్చింది.

హాలీవుడ్​ వాక్​ ఆఫ్​ ఫేమ్​ ప్రాంతానికి కిలో మీటరు దూరంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో గ్రామన్స్​ చైనీస్​ థియేటర్​, మేడమ్ టుస్సాడ్స్​ చట్టుముట్టు ఉన్న వీధుల్లో సైరన్​ మోతలతో ట్రాఫిక్​ కిక్కిరిసిపోయింది. మంటలపై నీళ్లు పోయడానికి తక్కువ ఎత్తులో ఎగురుతున్న హెలికాప్టర్ల భారీ శబ్ధాలతో అక్కడ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ప్రజలు సూట్​కేసులు పట్టుకుని హోటళ్లు, నివాసాల నుంచి బయటకు వచ్చే కాలినడకన సురక్షిత ప్రాంతాలకు బయలుదేరారు. కొంతమంది మంటల వైపు వెళ్లి ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు.

ఎగసి పడుతున్న నిప్పురవ్వలు (Associated Press)

అగ్నికి ఆహుతైన 1000పైగా నిర్మాణాలు
1000 కంటే ఎక్కువ నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అందులో ఎక్కువగా ఇళ్లు ఉన్నాయి. లాస్​ఎంజెలెస్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో 1.3 లక్షల మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. బుధవారం గాలుల తీవ్రత కాస్త తగ్గినా పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. పక్కరాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే నాలుగు చోట్ల భారీగా మంటలు చెలరేగుతున్నాయి.
లాస్​ ఏంజెలెస్​లో పాలిసాడ్స్​ చార్టర్​ హై స్కూల్​ సహా అరడజనుకు పైగా పాఠశాలలు కార్చిచ్చు ధాటికి దగ్ధమయ్యాయి. 1976లో వచ్చిన హార్రర్​ సినిమా క్యారీతో పాటు అనేక సినిమాల్లో ఈ పాఠశాల కనిపించిందని అధికారులు తెలిపారు.

మంటలను అదుపులోకి తెచ్చెేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది (Associated Press)

మైళ్ల మేర కాలిన దృశ్యాలే!
లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌కు పశ్చిమాన ఉన్న పసిఫిక్ తీరంలోని నివాస ప్రాంతాలను కార్చిచ్చు నేలమట్టం చేసింది. పసిఫిక్ పాలిసాడ్స్​లోని గ్రాసరీ స్టోర్స్​, బ్యాంకులను శిథిలాలుగా మార్చింది. కొండలతో ఉన్న ఈ ప్రాంతంలో సెలెబ్రెటీలు ఎక్కువగా నివాసం ఉంటారు. లాస్​ ఏంజెలెస్​ అధునిక చరిత్రలో ఇది అత్యంత విధ్వంసకరమైన అగ్నిప్రమాదంగా ఎల్​ఏ కౌంటీ అగ్నిమాపక చీఫ్​ ఆంథోనీ మర్రోన్ పేర్కొన్నారు. ఇక్కడ కాలిఫోర్నియా మిషన్​ స్టైల్​లో నిర్మించిన ఇళ్లను కార్చిచ్చు ఒక బ్లాక్​ తర్వాత మరో బ్లాక్​కు​ విస్తరించి పూర్తిగా శిథిలాలుగా మార్చింది. స్విమ్మింగ్ పూల్స్​ నల్లగా మారిపోయి. కాలిపోయిన ఇళ్ల అవశేషాలు, నల్లగా మారిన పంపు, గేట్​లు, కరిగిన టైర్లపై స్పోర్ట్స్​ కార్డు పడిపోయినట్లు- అక్కడ కిలోమీటర్ల మేర ఇదే దృశ్యం కనిపిస్తోంది.

నల్లగామారిన శిల్పాలు (Associated Press)
నేలమట్టమైన తన ఇల్లు చూస్తున్న జంట (Associated Press)

తప్పించుకోవడాని టైం లేక!
మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నందున చాలా మంది తప్పించుకోవడాని సమయం కూడా లేని పరిస్థితి ఏర్పడింది. కొందరు పోలీసుల పెట్రోలింగ్​ కారులో ఆశ్రయం పొందారు. వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వారిని వీల్​ ఛైర్లలో బయటకు తీసుకువచ్చారు.

హాలీవుడ్​ నటుల ఇళ్లు దగ్ధం
ధనవంతులు, సెలబ్రిటీలకు నిలయమైన కాలాబాసాస్, శాంటా మోనికాతో సంపన్న ప్రాంతాల వైపు మంటలు విస్తరిస్తున్నాయి. మార్క్ హామిల్, మాండీ మూర్, జేమ్స్‌వుడ్స్‌ వంటి హాలీవుడ్ స్టార్‌లు ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది.

కార్చిచ్చు ధాటికి దగ్ధమవుతున్న నివాస సముదాయం(ఉపగ్రహ చిత్రం) (Associated Press)

ఫెడరల్ ఎమర్జెన్సీ
కార్చిచ్చు గురించి తెలుసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గవర్నర్​ గవిన్​ న్యూసమ్​తో భేటీ అయ్యారు. శాంటా మోనికా అగ్నిమాపక కేంద్రానికి చేరుకున్న బైడెన్, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫెడరల్ ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకం చేశారు. అంతేకాకుండా సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయడానికి నేషనల్ గార్డ్​ దళాలను పంపించారు.

అయితే, లాస్‌ ఏంజెలెస్‌లో అగ్నికీలలను అదుపు చేయడంలో విఫలమైన కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌న్యూసమ్‌ రాజీనామా చేయాలని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్‌ చేశారు. ఏళ్ల తరబడి వాటర్‌ మేనేజ్‌మెంట్‌లో జరిగిన లోపాలను ఈ అగ్ని ప్రమాదాలు తెలియజేస్తున్నాయన్నారు.

కార్చిచ్చు వార్తలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులు (Associated Press)

మంటల్లో కాలిపోయిన ప్రముఖ ప్రాంతాలు
కార్చిచ్చు వ్యాప్తిస్తున్న నేపథ్యంలో అనేక హాలీవుడ్ స్టూడియోలు, ప్రొడక్షన్​ను నిలిపివేశాయి. పసాదేనా, పసిఫిక్ పాలిసాడ్స్​ మధ్య ఉన్న తమ థీమ్​ పార్క్​ను యోనివర్సల్​ స్టూడియోస్​ మూసివేసింది.

బైడెన్‌ లాస్ట్​ ఫారిన్ టూర్​ రద్దు
అధ్యక్షుడిగా జోబైడెన్‌ ఇటలీ, రోమ్‌లలో పర్యటించాల్సి ఉంది. తన పదవీకాలంలో చివరిదైన ఈ విదేశీ పర్యటనను రద్దు చేసుకొన్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది. ఆయన లాస్‌ఏంజెలెస్‌లో పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details