తెలంగాణ

telangana

ETV Bharat / international

కరాచీకి పోటెత్తిన బిచ్చగాళ్లు- పెరిగిన క్రైమ్ రేట్, ఎందుకో తెలుసా? - Beggars In Karachi - BEGGARS IN KARACHI

Beggars In Karachi : రంజాన్ సందర్భంగా పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీకి 3 నుంచి 4 లక్షల మంది బిచ్చగాళ్లు చేరుకున్నారు. దీంతో నగరంలో నేరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సింధ్ హైకోర్టు శాంతి భద్రతలను కాపాడాలని పోలీసులను ఆదేశించింది.

Beggars In Karachi
Beggars In Karachi

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 12:20 PM IST

Beggars In Karachi : దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, సంస్థల నుంచి తీసుకున్న రుణాలతో పాక్‌ రోజులు నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో రంజాన్ మాసంలో పాకిస్థాన్‌లోని కరాచీ నగరం బిచ్చగాళ్ల రాజధానిగా మారిపోయింది. దేశంలోని నలుమూలల నుంచి 3 నుంచి 4 లక్షల మంది యాచకులు కరాచీ చేరుకున్నారని, దీంతో నగరంలో నేరాలు పెరిగాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, కరాచీలోకి భారీ సంఖ్యలో బిచ్చగాళ్ల రాకపై పాక్‌కు చెందిన జియో న్యూస్‌ ఛానల్‌ ఒక నివేదికను రూపొందించింది.

రంజాన్ మాసంలో కరాచీలోని ప్రతి కూడలిలో యాచకులు దర్శనమిస్తున్నారని, దీనికితోడు నగరంలో ఇటీవలి కాలంలో నేరాలు మరింతగా పెరిగాయని కరాచీ అడిషనల్ ఇన్ స్పెక్టర్ జనరల్(AIG) ఇమ్రాన్ యకూబ్ మిన్హాస్ తెలిపారు. సింధ్, బలూచిస్థాన్, పాక్​లోని నలుమూలల నుంచి యాచకులు భారీ సంఖ్యలో కరాచీకి తరలివచ్చారని పేర్కొన్నారు. పాత పద్ధతుల్లో నేరస్థులను పట్టుకోవడం కష్టసాధ్యమని, అందుకే ప్రతి కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.

శాంతి భద్రతలు కాపాడాలి
ఇటీవలి కాలంలో కరాచీలో జరిగిన పలు నేరాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారని పలు మీడియా నివేదికలు తెలియజేస్తున్నాయి. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి నగరంలో నేరాల కారణంగా 55 మందికి పైగా మరణించారని పేర్కొన్నాయి. మరోవైపు గత కొద్ది రోజులుగా కరాచీలో పెరుగుతున్న నేరాలపై సింధ్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరాచీలో ఒక నెల రోజుల్లో శాంతిభద్రతలను పునరుద్ధరించాలని అధికారులకు అల్టిమేటం జారీ చేసింది. శాంతిభద్రతలు దిగజారడానికి కారణమైన ప్రభావవంతమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. కరాచీ నగరంలో శాంతిభద్రతలకు సంబంధించి 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరింది.

బలూచిస్థాన్​లో నిరసనలు
పాకిస్థాన్ అంతటా బుధవారం ఈద్ వేడుకలు జరగగా, బలూచిస్థాన్ ప్రావిన్స్​లో విద్యాసంస్థల్లో విద్యార్థుల బలవంతపు అదృశ్యాలు, వేధింపులు, జాతి వివక్షతకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు ప్రజలు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో మహిళలు, యువకులు ఆర్మీ వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొన్నారు. బలూచ్​కు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

41 సెకన్లు, 100 బుల్లెట్లు- నల్లజాతీయుడిపై కాల్పులు- అమెరికాలో కలకలం - youth died in police firing in us

పండుగ​ వేళ విషాదం- బస్సు లోయలో పడి 17మంది భక్తులు దుర్మరణం- 38మందికి గాయాలు - Pakistan Road Accident

ABOUT THE AUTHOR

...view details