తెలంగాణ

telangana

ETV Bharat / health

"పొట్ట" ఆరోగ్యాన్ని దెబ్బతిసే ఆహారాలు ఇవేనట!- జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు! - WORST FOODS FOR GUT HEALTH

-కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు -వీటితో పొట్ట ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం

Worst Foods for Gut Health
Worst Foods for Gut Health (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2024, 12:55 PM IST

Worst Foods for Gut Health: మన శరీరంలో పొట్ట ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే పొట్టను 'సెకండ్ బ్రెయిన్‌' అని కూడా అంటారు. ఎందుకంటే మన బ్రెయిన్​లో ఒక ఆలోచన వస్తే మొదట స్పందించేది పొట్ట మాత్రమే. అందుకే ఒత్తిడికి లోనైనప్పుడు కడుపు ఇబ్బందిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎవరిమీదనైనా కోపం వస్తే ఎసిడిటీఇబ్బంది పెడుతుంది. కాబట్టి, పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యమివ్వాలంటున్నారు. అయితే మనం తినే కొన్ని ఆహార పదార్థాలు పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం.

అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్ :కొంతమంది చిప్స్, కూల్ డ్రింక్స్‌, చాక్లెట్స్, బిస్కట్లు, పిజ్జా, కేకులు ఇలాంటివి ఎక్కువగా తింటుంటారు. ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్ జాబితాలోకి వస్తాయి. ఈ ఆహార పదార్థాల్లో ఉప్పు, షుగర్​, కొవ్వు పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల పొట్టలోని బ్యాక్టీరియాను అసమతుల్యం చేసే అవకాశం ఉంటుందని.. కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండడం మంచిదంటున్నారు. అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్ పొట్టలోని బ్యాక్టీరియాను ప్రభావితం చేస్తుందని National Institutes of Health (NIH) నిపుణుల బృందం వెల్లడించింది. దీర్ఘకాలంలో ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చని అభిప్రాయ పడ్డారు. (రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).

తీపి పదార్థాలు :మన ఆరోగ్యంవిషయంలో పేగుల్లోని బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం చేయడం నుంచి, రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఎంతో తోడ్పడుతుంది. అయితే, మన కడుపులో మంచి బ్యాక్టీరియాతో పాటు చెడు బ్యాక్టీరియా కూడా ఉంటుంది. తిన్న ఆహారం జీర్ణమవడంలో మంచి బ్యాక్టీరియా కీలక పాత్ర వహిస్తుంది. కానీ, చెడు బ్యాక్టీరియా వల్ల అల్సర్లు, గ్యాస్‌ వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాకు నష్టం కలిగి, చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని నిపుణులంటున్నారు. దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. కాబట్టి, పొట్టలోని బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బ తీసే రిఫైన్డ్ షుగర్‌, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదంటున్నారు.

ఎక్కువగా ఫ్రై చేస్తే :కొంతమందికి ఎక్కువగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలంటే ఎంతో ఇష్టం. ఇవి జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దానివల్ల పొట్ట ఆరోగ్యం దెబ్బతింటుందని.. కాబట్టి, తరచూ ఎక్కువగా ఫ్రై చేసిన వంటలకు దూరంగా ఉండడం మంచిదంటున్నారు.

కృత్రిమ చక్కెరలు :షుగర్​ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచిది కాదన్న కారణంతో కొందరు వాటికి బదులుగా కృత్రిమ చక్కెరలను ఆహారంలో చేర్చుకుంటారు. అయితే ఇవి రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తాయని.. ఫలితంగా పొట్ట ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడడమే కాకుండా.. పొట్టలోని మంచి బ్యాక్టీరియాను అసమతుల్యం చేస్తుంటాయంటున్నారు. కాబట్టి, వీటికి కూడా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ డ్రింక్స్ తాగేవారికి క్యాన్సర్ ముప్పు! - లివర్ దెబ్బతింటుందట! - రీసెర్చ్​లో వెల్లడి!

చట్నీలను ఫ్రిజ్​లో పెట్టి తింటున్నారా? నాన్​వెజ్ పెట్టినా కూడా బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్!

ABOUT THE AUTHOR

...view details