తెలంగాణ

telangana

ETV Bharat / health

పైల్స్​తో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఆసనం వేస్తే ఈజీగా తగ్గిపోతుంది! మీరు ట్రై చేయండిలా - piles reducing yoga asanas - PILES REDUCING YOGA ASANAS

Piles Reducing Yoga Asanas : ప్రస్తుతం పైల్స్​ సమస్య లింగ బేధం లేకుండా అందరిని వేధిస్తోంది. ఈ సమస్య వచ్చాక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఎవరికీ చెప్పుకోలేక.. కూర్చోలేక, నడవలేక.. ఇలా ప్రతీ విషయంలోనూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే, ఈ సమస్యకు యోగాసనాలతో చక్కని పరిష్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పైల్స్ బాధపడుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన యోగా ఆసనాలు ఏంటి? ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం

Piles Reducing Yoga Asanas
Piles Reducing Yoga Asanas (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Aug 28, 2024, 4:19 PM IST

Piles Reducing Yoga Asanas : పైల్స్​తో బాధపడుతున్నప్పుడు ముళ్ల కంపపై కూర్చున్నట్లుగా ఉంటుంది. పైల్స్ అనేవి ప్రాణాల మీదకు తీసుకువచ్చే సమస్య కాకపోయినా.. అనుక్షణం ఆసనంలో ముల్లులాగా కుచ్చుకుంటూ నరకాన్ని చూపిస్తుంటాయి. మలవిసర్జనకు వెళ్లినప్పుడు కనిపించే రక్తం.. చాలా మందిని కంగారు పెడుతుంటుంది. నిత్య జీవితాన్ని దుర్భంరంగా మార్చే ఈ పైల్స్​ బాధల నుంచి ఉపశమనం పొందడానికి యోగాసనాలు ఎంతగానో ఉపకరిస్తాయని ప్రముఖ యోగా గురువు ఆర్​ ఆర్​ ప్రసాద్​ చెబుతున్నారు. ఆసన భాగంలో వేడి పెరగడం, రక్త ప్రసరణ జరగకపోవడం, మలబద్ధకం కారణంగా పైల్స్​ సమస్య వస్తోందన్నారు. ఫైబర్​ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను సహజంగా నయం చేసుకోవచ్చని చెప్పారు. ఇందుకు యోగాలోని సర్వాంగాసనము, సహజ శంఖుముద్ర ఆసనాలను క్రమ పద్ధతిలో ప్రతి రోజు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పైల్స్​కు పరిష్కారం చూపే ఈ ఆసనాలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సర్వాంగాసనము ఎలా చేయాలి?

  • ముందుగా సుఖాసనం చేసి ఆ తర్వాత శవాసనం వేయాలి.
  • ఆ తర్వాత రెండు కాళ్లను మడిచి.. మోకాళ్లను లేపి పొట్ట వైపునకు తేవాలి.
  • అనంతరం చేతులను నడుముకు ఆనించి, ఒక్క సారిగా తుంటిని పైకి లేపాలి.
  • ఆ తర్వాత భుజాలు, మోచేతులు నేలకు ఆనించి కాళ్లను తిన్నగా పైకి చాచాలి.
  • శరీరం నియంత్రణలో ఉండేలా చూసుకొని శ్వాసను యథావిధిగా తీసుకుంటూ కళ్లను మూసుకోవాలి.
  • రెండు నిమిషాల తర్వాత నెమ్మదిగా మామూలు స్థితికి చేరుకోవాలి.

శంఖుముద్ర ఎలా చేయాలంటే?

  • ముందుగా పద్మాసనంలో లేదా సౌఖ్యంగా ఉండే ఆసనంలో కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
  • ఆ తర్వాత రెండు చేతులనూ ఛాతీ ముందుకు, నాభికి దగ్గరగా తీసుకు రావాలి.
  • రెండు అర చేతులు, రెండు చేతుల వేళ్లను ఒకదానితో ఒకటిని కలపాలి.
  • రెండు బొటనవేళ్లను పైకి లేపి ముందుకు చూస్తున్నట్లుగా ఉంచుకోవాలి.
  • అనంతరం ఈ ముద్రను శరీరానికి తగలనివ్వకుండా కళ్లు మూసుకుని చేయాలి.
  • అనంతరం ప్రశాంతంగా శ్వాస తీసుకుని వదులుతూ దానిపైనే ధ్యాస పెట్టాలి.
  • ఆ తర్వాత కళ్లు తెరిచి ముద్రను తీసేసి సాధారణ స్థితికి చేరుకోవాలి.

ఈ రెండు ఆసనాలను ప్రతిరోజూ ఉదయాన్నే 5సార్లు నిపుణుల సమక్షంలో చేయాలని యోగా గురువు ఆర్ ఆర్​ ప్రసాద్​ వెల్లడించారు. తీవ్రమైన వెన్నునొప్పి, మెడనొప్పి ఉన్నవారు వేయకూడదని హెచ్చరించారు. ఈ ఆసనాలు చేస్తూనే ఆహారపు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీరు ఎక్కువగా తాగాలని.. జంక్​ఫుడ్​కు దూరంగా ఉండాలని చెప్పారు.

NOTE:ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

లెమన్​, గ్రీన్ టీలు మాత్రమే కాదు - ఈ టీ తాగినా బోలెడు ప్రయోజనాలు! వయసు కూడా తగ్గిపోతారట! - white tea health benefits in telugu

మీ బాణపొట్టకు కారణం తిండి కాదు- మీరు చేసే ఈ చిన్న తప్పులేనట! - షాకింగ్ రీసెర్చ్! - Belly Fat Causes

ABOUT THE AUTHOR

...view details