Best Sleeping Position :నిద్ర విషయంలో చాలా మందికి చాలా సందేహాలుంటాయి. నిద్ర పట్టడం మొదలుకుని ఎంత సేపు నిద్రపోవాలి? ఏ దిక్కువైపు తల పెట్టుకోవాలి? ఎటు వైపు కాళ్లు పెట్టకూడదో! అనే సందేహాలు వారికి నిద్ర పట్టకుండా చేస్తాయి. బోర్లా పడుకోవాలా, వెల్లకిల్లా పడుకోవాలా? లేక ఎడమ వైపు తిరిగి పడుకోవాలా, లేదంటే కుడివైపా అనే ఆలోచనలు వేధిస్తుంటాయి. ఈ నేపథ్యంలో నిద్ర గురించి చేసిన ఓ అధ్యయనం ఆసక్తికరమైన అంశాలు వెల్లడించింది. అవేమిటో తెలుసుకుని అన్ని సందేహాలకు చెక్ పెట్టేద్దాం.
కొంత మందికి బోర్లా, వెల్లకిలా పడుకోవడం అలవాటు! కానీ, ఎడమవైపుకి తిరిగి పడుకోవడమే మంచిదని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. తద్వారా భవిష్యత్తులో మెదడు సంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తపడచ్చని తేల్చింది. ఏ వయసు వారికైనా ఈ నిద్రా భంగిమే మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల ఆరోగ్యపరంగా బహుళ ప్రయోజనాలు చేకూరతాయని సూచిస్తున్నారు.
ఈ నూనెతో మొటిమలకు చెక్? - ముఖం సున్నితమై స్కార్ఫ్ కట్టుకోవాల్సిందేనట!
జీర్ణవ్యవస్థకు మేలు :
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే దాదాపు అన్ని అవయవాల పనితీరు కూడా బాగుంటుంది. ఎడమవైపుకి తిరిగి పడుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుందట. జీర్ణానంతరం ఆహారంలో మిగిలిన వ్యర్థాలు, టాక్సిన్లు మొదట పెద్ద పేగులో ప్రారంభ భాగమైన సెకమ్‌లోకి చేరుకుంటాయి. అది మన శరీరంలో కుడివైపున ఉంటుంది. ఇవి క్రమంగా ఎడమవైపు ఉన్న పెద్ద పేగు చివరి భాగమైన పురీష నాళం వరకు ప్రయాణిస్తాయి.
ఈ నేపథ్యంలో మనం ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ కారణంగా కుడి నుంచి ఎడమకు ఈ వ్యర్థాలన్నీ సులభంగా వెళ్లిపోయే అవకాశం దొరుకుతుంది. తద్వారా ఉదయాన్నే సులభంగా వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటికి వెళ్లిపోతాయి. పెద్ద పేగు ఎప్పటికప్పుడు పూర్తిగా ఖాళీ కావడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడి పొట్ట ఆరోగ్యానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికీ దోహదం చేస్తుంది. అందుకే పడుకునేటప్పుడైనా, విశ్రాంతి తీసుకునేటప్పుడైనా ఎడమవైపు చాలా బెటర్ అని నిపుణులు చెప్తున్నారు.
గుండె ఆరోగ్యానికీ మంచిది :
అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యల కారణంగా మహిళల్లోనూ గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భవిష్యత్‌లోనూ ఇలాంటి సమస్యలు రాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో నిద్రా భంగిమ కీలకమే అంటున్నారు నిపుణులు. శరీరంలో గుండె ఎడమ వైపు ఉంటుంది కాబట్టి ఎడమవైపుకి తిరిగి నిద్రపోవడం వల్ల గురుత్వాకర్షణ కారణంగా రక్తం సులభంగా గుండెకు సరఫరా అవుతుంది. తద్వారా గుండెపై ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గర్భిణులకు మేలు :