What Not To Do Skincare In Summer :వేసవి కాలంలో శరీరాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, ఎండ వేడి నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. సూర్యుని తాపం ప్రభావం అన్ని కాలాల కన్నా వేసవిలో చర్మాన్ని బాగా ఇబ్బంది పెడుతుంది. చెమట, జిడ్డు, చర్మం రంగు మారడం, చెమట కారణంగా వచ్చే దురద, దద్దుర్లు ఇలా చాలా రకాల సమస్యలు వేసవి కాలంలో వస్తుంటాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి ముఖానికి స్కార్ఫ్లు, గొడుగులు వేసుకుని బయటకు వెళ్తుంటారు. మాయిశ్చరైజర్ క్రీములు రాసుకుని చర్మాన్ని కాపాడుకుంటారు. ఇంకొందరు ఇంట్లోనే దోసకాయ, కలబంద లాంటి సహజమైన పదార్థాలను చర్మానికి రాసుకుని చర్మ సమస్యలు రాకుండా చూసుకుంటారు. అయితే చర్మానికి ఏం రాసుకోవాలి? ఏం చేయాలి? అనే విషయాన్ని పక్కన పెడితే ఈ వేసవిలో కొన్ని చర్మానికి వాడకూడని పదార్థాలు, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయట! అవేంటో తెలుసుకుందామా మరి
మేకప్
వేసవి అంటేనే చెమట. కాబట్టి ఎండాకాలంలో చర్మాన్ని కాపాడుకోవాలంటే ముఖ్యంగా చేయకూడని పని మేకప్ వేసుకోవడం. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉండే ఈ కాలంలో ముఖ రంధ్రాలు గాలి పీల్చుకోవడం అవసరం. తరచుగా మేకప్ వేసుకోవడం, ఎక్కువ సేపు మేకప్ వేసుకుని ఉండటం వల్ల గాలి చొరబడక విపరీతమైన మొటిమలు వస్తాయని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదే కాక విరేచనాల సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
తరుచుగా కడుక్కోవడం
చెమట పట్టిందని, జిడ్డుగా మారిందని చాలా మంది ముఖాన్ని తరచుగా కడుగుతూ ఉంటారు. చర్మం విషయంలో ఇది చాలా పెద్ద పొరపాటు అవుతుందట. ఇలా తరచుగా ముఖాన్ని కడుక్కోవడం, ఎక్కువ సార్లు స్నానం చేయడం వల్ల మీ చర్మంపై సహజంగా ఉండే నూనెలు తొలగిపోతాయి. ముఖం, చర్మం పొడిగా మారి విరిగిపోయేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
సన్ స్క్రీన్
ఎండాకాలంలో చర్మాన్ని కాపాడుకోవాలంటే ఎప్పుడూ మీ చర్మంపై సన్ స్క్రీన్ ఉండాలి. అది ఉదయం, సాయంత్రం అయినా, చివరికి రాత్రి అయినా సరే సన్ స్క్రీన్ క్రీము రాసుకోకుండా అస్సలు బయటకు వెళ్లకూడదు. ముఖ్యంగా మీరు రాసుకునే క్రీము SPF (సన్ ప్రొటెక్షన్ ప్యాక్టర్) ఫ్రెండ్లీగా ఉండాలన్నది మరిచిపోకండి.