What are the Reasons for Dark Circles: ప్రస్తుతం చాలామందిని వేధించే సమస్య.. కళ్ల కింద నల్లటి వలయాలు. పిల్లలు, పెద్దలు.. అనే తేడా లేకుండా, జెండర్‌తో సంబంధం లేకుండా చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్‌పై గడపడం, టీవీ ఎక్కువగా చూడటం, పదేపదే కాఫీ తాగడం, ఎక్కువ ఒత్తిడికి గురికావడం.. మొదలైనవన్నీ కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణాలే. అయితే డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి ఇవి మాత్రమే కారణం కావని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా కారణమని నిపుణులు అంటున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..
రక్తహీనత:ఐరన్ లోపం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. ఈ కారణంగా, ఆక్సిజన్ శరీరంలోని అన్ని భాగాలకు తగినంత పరిమాణంలో చేరదు. ఆక్సిజన్ లోపం చర్మాన్ని పాలిపోయేలా చేస్తుంది. అలాగే రక్త నాళాలు ముదురు రంగులోకి మారడానికి కారణమవుతుంది. ఇది కళ్ల కింద నల్లటి వలయాలకు దారితీస్తుంది. 2017లో Clinical and Experimental Dermatology జర్నల్ ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రక్తహీనత కలిగిన మహిళల్లో కళ్ల కింద నల్లటి వలయాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పోలాండ్లోని జాగిలోనియాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన డా. అన్నా కోవల్స్కా పాల్గొన్నారు.
డీహైడ్రేషన్:ప్రతిరోజూ ఒక వ్యక్తికి 8 గ్లాసుల నీరు అవసరం. దీనికంటే తక్కువ నీరు త్రాగితే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇది కూడా కళ్ల కింద నల్లటి వలయాలకు కారణమవుతుందని అంటున్నారు.
థైరాయిడ్:థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను సరిగా విడుదల చేయకపోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు ఎక్కువ లేదా తక్కువ కూడా ఉండొచ్చు. ఇలా థైరాయిడ్ సమస్య ఏర్పడటం వల్ల కూడా కళ్ల కింద నల్లని వలయాలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
కళ్ల కింద క్యారీ బ్యాగ్స్‌ను అరటి తొక్క క్లియర్ చేస్తుందా? నిజమెంత? - Banana Peels For Under Eye Bags
విటమిన్ లోపం:శరీరంలో విటమిన్-బి, విటమిన్-కె, విటమిన్-ఇ, విటమిన్-డి వంటి విటమిన్లు లోపం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే నల్లటి వలయాలు చాలా కాలం పాటు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి విటమిన్ల లోపాన్ని చెక్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. 2014లో European Journal of Clinical Nutrition ప్రచురితమైన అధ్యయనం ప్రకారం తక్కువ విటమిన్ కె తీసుకునే మహిళల్లో కళ్ల కింద నల్లటి వలయాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. ఈ పరిశోధనలో పోలాండ్లోని జాగిలోనియాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన డా. అన్నా కోవల్స్కా పాల్గొన్నారు.
హైపర్‌పిగ్మెంటేషన్:సన్‌స్క్రీన్ లేదా సన్ ప్రొటెక్షన్ లేకుండా సూర్యరశ్మికి ఎక్కువ సేపు బహిర్గతం కావడం వల్ల హైపర్‌పిగ్మెంటేషన్ వస్తుంది. మెలనిన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఇది జరుగుతుంది. ఈ కారణం చేత కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయని నిపుణులు అంటున్నారు.
చర్మవ్యాధులు:చర్మవ్యాధుల వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. చర్మం పొడిబారడం, ఎరుపు, వాపు వంటి సమస్యలు వస్తాయి. దీని కారణంగా కళ్ల దగ్గర రక్త నాళాలు వ్యాకోచించి, చర్మం పైన నల్లగా కనిపిస్తాయి. అంతే కాకుండా కొన్నిసార్లు అలెర్జీల కారణంగా కూడా నల్లటి వలయాలు ఏర్పడతాయి. అలాగే తరచుగా కళ్లు రుద్దడం, వయసు పెరగడం, అకాల వృద్ధాప్యం, ఒత్తిడి, కళ్లు లోతుగా ఉండటం, ధూమపానం మొదలైనవి కూడా నల్లటి వలయాల సమస్యకు కారణం అవుతాయి.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ టీ తాగితే - 300 ఉన్న షుగర్ కూడా నార్మల్కు రావడం పక్కా! - Health Benefits of Mango Peel Tea
సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ - ఇవి తాగితే ఎండ వేడిమి, డీహైడ్రేషన్ మీ దరిచేరవు! ప్రిపరేషన్ వెరీ ఈజీ! - Summer Homemade Drinks