Premature Gray Hair Causes :ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే జుట్టు తెల్లగా మారేది. కానీ.. ప్రస్తుతం 30 సంవత్సరాల్లోనే వైట్ హెయిర్(Hair) ప్రాబ్లమ్ వేధిస్తోంది. దీంతో చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడేందుకు నలుపు రంగు కలర్ వేసుకుంటూ మేనేజ్ చేస్తున్నారు. మరి.. చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడానికి కారణాలేంటి? దీనిని తగ్గించుకునే పరిష్కార మార్గాలేంటి? వైద్యులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడానికి.. బాడీలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యం(హార్మోన్) తగ్గిపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు. వయసు పెరుగుతున్నకొద్దీ ఇది క్రమంగా తగ్గిపోవడం సహజం. కానీ.. కొన్ని కారణాలతో కొంతమందిలో మెలనిన్ ముందుగానే తగ్గిపోతుంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం అవుతున్నాయని అంటున్నారు.
"యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా"లో.. డెర్మటాలజీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ టేలర్ ఈ సమస్యను విశ్లేషించారు. మెలనిన్ లోపించడం కారణంగానే ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. సాధారణంగా వయసు పైబడే కొద్దీ జుట్టుకు రంగును ఇచ్చే సామర్థ్యాన్ని మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలు(మెలనోసైట్లు) తగ్గిపోతాయని టేలర్ చెప్పారు. కొందరు చిన్న వయసులోనే జుట్ట నెరిసే సమస్యను ఫేస్ చేయడానికి గల కారణాలను టేలర్ వివరించారు.
కొన్ని ఆరోగ్య సమస్యలు వంశపారంపర్యంగా వచ్చినట్టే.. జుట్టు నెరవడమనే సమస్య కూడా వంశపారంపర్యంగా రావడానికి అవకాశం ఉందని చెప్పారు. అంతేకాకుండా.. మితిమీరిన మద్యపానం, ధూమపానం వల్ల ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా రావొచ్చట. ఎందుకంటే.. ఇవి ఆక్సీకరణ ఒత్తిడికి దారి తీస్తాయని.. ఫలితంగా జుట్టు త్వరగా తెల్ల బడటానికి చాన్స్ ఉందని టేలర్ చెప్పారు.