These Types of Shoes that can Lead to Foot Injuries :ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది స్టైల్‌గా, డిఫరెంట్ లుక్‌తో కనిపించాలని వివిధ రకాల బూట్లు ధరిస్తుంటారు. అలాగే, ఉదయం వేళ వాకింగ్, రన్నింగ్ వెళ్లే వారు షూస్తప్పనిసరిగా వాడుతుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది కంఫర్ట్‌గా ఉంటుందని ఎత్తు ఎక్కువగా ఉండే హీల్డ్ షూస్ ధరిస్తుంటారు. మీరూ ఆ జాబితాలో ఉంటే ఇప్పుడే వాటిని మార్చడం మంచిది! ఎందుకంటే ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా జరిపిన ఓ పరిశోధనలో హై హీల్డ్ బూట్లు కీళ్ల నొప్పులు, గాయాల ప్రమాదాన్ని పెంచుతాయని వెల్లడైంది. ఆ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఫ్లాటర్ షూస్ ధరించిన వారితో పోలిస్తే మందపాటి లేదా ఎత్తు ఎక్కువగా ఉన్న హీల్డ్ బూట్లను ధరించిన వారిలో గాయాల బెడద ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది. యూఎస్ఏలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ రీసెర్చ్‌ను జరిపారు. ఇది "Frontiers in Sports and Active Living"అనే జర్నల్‌లో ప్రచురితమైంది.
అదే పనిగా చెప్పులు, షూలు వేసుకుంటున్నారా? - ఈ సమస్యలు ఎటాక్ చేసే ఛాన్స్!
ఈ రీసెర్చ్‌లో పాల్గొన్న వారిలో ఒకరైన యూఎఫ్ హెల్త్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ సెంటర్ డెరెక్టర్, ప్రముఖ రచయిత్రి హీథర్ విన్సెంట్ ఇందుకు సంబంధించి మరికొన్ని వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా మందపాటి, మడమల బూట్లు ధరించిన రన్నర్‌లు ప్రతి అడుగుతో వారి పాదాలను ఎలా ల్యాండ్ చేశారో కచ్చితంగా గుర్తించడానికి కష్టపడుతున్నారు. అంతేకాదు, ఈ రకమైన షూస్ గాయం తీవ్రత పెరగడానికి దోహదం చేస్తుంది. అందుకే పరిశోధకులు చాలా మంది రన్నర్లకు ఫ్లాటర్ షూలను సిఫార్సు చేస్తారు. ఎందుకంటే అవి తక్కువ గాయం ప్రమాదాలతో ముడిపడి ఉంటాయంటున్నారు హీథర్ విన్సెంట్. అంతేకాకుండా ఫ్లాటర్ షూస్ గ్రౌండ్ సెన్సేషన్‌ను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. అలాగే, రన్నర్‌లు మరింత కంట్రోల్డ్ ల్యాండింగ్ టెక్నిక్‌ను డెవలప్ చేయడంలో సహాయపడతాయంటున్నారు.
అదేవిధంగా, చాలా త్వరగా కొత్త షూ రకానికి మారడం లేదా ఫుట్ స్ట్రైక్ ప్యాటర్న్‌లను మార్చడం చేస్తే కూడా గాయం ప్రమాదాన్ని కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఏదేమైనప్పటికీ రన్నింగ్షూస్ మాత్రమే కాకుండా నార్మల్ షూస్ విషయంలో కూడా హై హీల్డ్వి కాకుండా ఫ్లాట్‌గా ఉండేవి ఎంచుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఒక రిసెర్చ్‌లో కూడా సరైన షూస్ లేదా చెప్పులుధరించకపోవడం వల్ల ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉందని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ షూస్ నుంచి దుర్వాసన వస్తోందా? - ఇలా చెక్ పెట్టండి!