Health Benefits Of Walnuts :నేటి టెక్నాలజీ యుగంలో బిజీ లైఫ్ వల్ల సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య భార్యభర్తలను ఎన్నోరకాలుగా ఒత్తిడికి గురిచేస్తుంది. మానసికంగా కుంగదీస్తుంది. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా.. సంతానం కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతే మనసులో ఏదో వెలితి. కోపం, నిస్సహాయత, ఆత్మన్యూనత, ఆవేదన వంటి భావోద్వేగాలు మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. సంతాన లేమి సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే, చాలా మంది ఈ విషయంలో మహిళలను తప్పుబడుతుంటారు.
కానీ, మహిళ గర్భం దాల్చకపోవడానికి పురుషుల్లో ఉండే కొన్ని సమస్యలు కూడా కారణమవుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వీర్య కణాల సంఖ్య తగ్గటం, ఆరోగ్యకరంగా లేకపోవడం, జన్యుపరమైన సమస్యలు వంటివి సంతానరాహిత్యానికి దారి తీస్తాయంటున్నారు. కాబట్టి, మీరూ(పురుషులు) ఈ సమస్యల కారణంగా సంతానలేమితో ఇబ్బందిపడుతున్నట్లయితే.. మీ డైలీ డైట్లో "వాల్నట్స్"(Walnuts)భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అవి తినడం ద్వారా మీ సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడడమే కాకుండా.. సంతానప్రాప్తి కలుగుతుందంటున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అచ్చంగా మెదడు ఆకారాన్ని పోలి ఉండే వాల్నట్స్(ఆక్రోట్స్)లో వృక్ష సంబంధ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రొటీన్, పీచు, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా వీటిని తినడం ద్వారా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు. ముఖ్యంగా పురుషుల్లో తలెత్తే సంతాన సమస్యలన్ని తగ్గించడంలో ఆక్రోట్లలో ఉండే పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. రోజూ ఆక్రోట్లను తినే మగవారిలో వీర్యం నాణ్యత మెరుగుపడి, సంతానం కలగటానికి తోడ్పడుతున్నట్టు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
అలర్ట్ : థైరాయిడ్ ఉంటే గర్భం ధరించలేరా? - వైద్యులు ఏమంటున్నారో తెలుసా!