తెలంగాణ

telangana

ETV Bharat / health

వీకెండ్​లో వాకింగ్ ఎక్కువ చేస్తున్నారా? - అయితే నష్టం తప్పదట! ఎందుకో తెలుసా? - walking mistakes to avoid - WALKING MISTAKES TO AVOID

Walking Mistakes to Avoid: ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే కాంక్ష ప్రతి ఒక్కరిలో పెరిగింది. ఈ క్రమంలోనే వాకింగ్​కు వెళ్లడం, వ్యాయామం చేయడం సాధారణమైపోయింది. అయితే, వాకింగ్​ చేసే సమయంలో కొన్ని పొరపాట్ల కారణంగా ఆరోగ్యానికి బదులుగా సమస్యలు వస్తుంటాయని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Walking Mistakes
Walking Mistakes to Avoid (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Aug 26, 2024, 7:01 PM IST

Avoid These Mistakes While Walking for Good Health:శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతిరోజు వాకింగ్ చేయడం చాలా మంచి అలవాటు. క్రమం తప్పకుండా వాకింగ్​ చేస్తే కండరాలు బలంగా తయారవుతాయి. అంతేగాక నడక వల్ల శరీరంలోని కేలరీలు కరిగి కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.. తద్వారా ఊబకాయం తగ్గుతుంది. అలాగే ఉదయం పూట వచ్చే స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తులో రక్తాన్ని శుభ్రపరిచేందుకు ఉపయోగపడుతుంది. వాక్ చేయడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు కనీసం 3 కిలోమీటర్లు నడవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే, వాకింగ్ చేసే సమయంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువంటున్నారు ప్రముఖ యోగా థెరపిస్ట్ సంగీత​ అంకత. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ తప్పులు చేయొద్దు:

  • చాలామంది వాకింగ్​ చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడుతుంటారు. ఇలా స్నేహితులతో మాట్లాడుకుంటూనే సమయమంతా వృథా చేస్తుంటారు. గంటసేపు వాకింగ్​కు వెళ్లినా సరిగ్గా కనీసం 10 నిమిషాలు కూడా నడవరు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అంటున్నారు.
  • కొందరు వీకెండ్​, సెలవు రోజున ఎక్కువ సమయం, దూరం వాకింగ్​ చేస్తుంటారు. అయితే ఇలా ఎక్కువ వాకింగ్ చేయడం వల్ల శరీరం వేగంగా అలసిపోతుంది. ఆ తర్వాత దానికి తగినట్లు విశ్రాంతి ఇవ్వకపోతే శరీరానికి నష్టం తప్పదు. వాకింగ్‎లో మూడు నిమిషాలు స్పీడ్​గా చేస్తే, మూడు నిమిషాలు నెమ్మదిగా చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో జీవక్రియ పనితీరు మెరుగుపడుతుందని వివరిస్తున్నారు.
  • వాకింగ్​ అనగానే కాళ్లు చేసే పని అని అనుకుంటారని.. కానీ, వాకింగ్ చేసేటప్పుడు మన చేతులు కూడా రిథమిక్​గా కదపాలని చెప్పారు. అంటే ఎడమ కాలితో అడుగు వేస్తుంటే కుడి చేతిని ముందుకు కదపాలని.. అలానే కుడి కాలితో నడుస్తున్నప్పుడు ఎడమ చేయితో చేయాలని వివరించారు. ఇలా చేయడం వల్ల గుండెకు రక్తం సరఫరా ఎక్కువగా అవుతుందని వెల్లడించారు. అలాగే చేతులను కిందకు వదలకుండా 90 డిగ్రీలకు వంచి వాకింగ్​ చెయ్యాలని.. ఇలా చేయడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయన్నారు.
  • పొట్టను లోపలికి లాగి వాకింగ్ చేస్తే కండరాలపైనా ప్రభావం పడి తగ్గిపోతుందని తెలిపారు. అలా అని పొట్ట కండరాలను మరీ గట్టిగా లాగకూడదని సూచిస్తున్నారు.
  • ఇంట్లో మాదిరిగానే వాకింగ్​కు వెళ్లినప్పుడు కూడా చాలా మంది ఫోన్లలో చాటింగ్, సోషల్​ మీడియా వాడుతుంటారు. ఇలా పరిసరాలను పట్టించుకోకుండా వాకింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్నేహితులు, జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో వాకింగ్ చేయడం చాలా ఉత్తేజాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటిని కూడా వాకింగ్​కు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

  • వాకింగ్ చేసేటప్పుడు ధరించే దుస్తులు మరీ బిగుతుగా, వదులుగా ఉండకుండా మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి.
  • ఎక్కువగా కాటన్ దుస్తులు వాడడం మంచిది.
  • వర్షాకాలంలో రెయిన్ కోట్​, గొడుగు, ఎండాకాలంలో టోపీ, అద్దాలు ధరించాలి.
  • పాదాలకు సరిపోయేలా బూట్లు ధరించాలి. పూర్తిగా కాళ్లు, వేళ్లు కప్పేలా ఉండి నడిచేందుకు సౌకర్యంగా ఉండాలి.
  • చెమటను పీల్చే సాక్స్​లను వాడడం ఉత్తమం.
  • ఒకే దారిలో కాకుండా అప్పుడప్పుడూ మార్గాలను మార్చాలి.
  • ఎక్కువ శబ్ధం పెట్టుకుని చెవిలో ఇయర్​ ఫోన్స్ పెట్టుకోకూడదు.
  • వాకింగ్ చేస్తున్నప్పుడు అనవసర విషయాలకు తావు ఇవ్వకుండా ఘర్షణలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలి.
  • ఉదయం వేళ పరిస్థితులు దినచర్యపై ప్రభావం చూపకుండా చర్యలు తీసుకోవాలి.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

యూరిక్ యాసిడ్​ ఎక్కువై ఇబ్బందిపడుతున్నారా? - ఈ ఆహారాల జోలికి వెళ్లకుంటే ఇట్టే తగ్గిపోతుంది!! -

రీసెర్చ్​: గంటలపాటు నడవాల్సిన అవసరం లేదు - ఇన్ని నిమిషాలు వాకింగ్​ చేస్తే చాలు - ఫుల్​ హెల్త్​!

ABOUT THE AUTHOR

...view details