తెలంగాణ

telangana

ఫ్రిజ్​లోనే పాలను స్టోర్​ చేయాల్సిన అవసరం లేదు- సింపుల్ టిప్స్​తో బయట కూడా సేఫ్​గా! - Tips To Store Milk Without Fridge

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 9:50 PM IST

Tips To Store Milk Without Fridge : పోషకాహారమైన పాలను ఫ్రిజ్‌లోనే ఉంచి దాయాల్సిన అవసరం లేదు. ఏ మాత్రం పాడవకుండా అదే రుచితో ఉండేలా ఇలా చేయొచ్చని మీకు తెలుసా? అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.

Tips To Store Milk Without Fridge
Tips To Store Milk Without Fridge (Getty Images)

Tips To Store Milk Without Fridge : పాల వల్ల కలిగే ప్రయోజనాలు ఒకటి రెండు కాదు బోలెడు. ప్రపంచ దేశాలన్నీ అందుకే పాలను పౌష్టికాహారం అని పొగిడేస్తూ వారి డైలీ లైఫ్‌లో చేర్చుకుంటున్నారు. రోజూ ఉదయం లేదా రాత్రి సమయంలో ఒక గ్లాసుడు పాలను తాగితే బెనిఫిట్ అని మనకు కూడా తెలుసు. మరి సాయంత్రం లేదా ఉదయం తాగేందుకు పాలు ఉండాలి కదా. రిఫ్రిజరేటర్ అదే ఫ్రిజ్​లో పెట్టి నిల్వ చేసుకునే వెసలుబాటు లేని వాళ్లు లేదా ఆ ఇంట్రస్ట్ లేని వాళ్లు వాటిని ఎలా నిల్వ చేసుకోవచ్చో, అది కూడా రుచి మారకుండా ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం రండి.

చల్లని ప్రదేశం
మీ ఇంట్లోనే చల్లగా ఉండే ప్రదేశాన్ని వెతకండి. బేస్‌మెంట్ లేదా చల్లగా ఉండే ప్రాంతమేదైనా ఉండొచ్చు. సూర్యుడి ఎండ నేరుగా పడని ప్రాంతం ఏదైనా సాధారణ ఉష్ణోగ్రతనే కలిగి ఉంటుంది కాబట్టి అక్కడ పాలను ఉంచితే పాడవ్వవు.

మూసి ఉంచిన కంటైనర్
పాలను చాలా గట్టిగా మూత పెట్టి ఉంచిన క్లోజ్‌డ్ కంటైనర్‌లో ఉంచండి. అలా చేయడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా దరిచేరదు. ఒక గ్లాసు లేదా మెటల్ గిన్నె లాంటిదానిలో టైట్ మూత బిగించి ఉంచండి.

వేడికి దూరం
స్టవ్​లకు లేదా ఓవెన్​లకు దగ్గరగా పాలను ఉంచకండి. అంటే వేడి తగిలే ప్రదేశాలకు దూరం పాలను ఉంచండి. వేడి వల్ల బ్యాక్టీరియా పెరిగి పాలను పాడు చేస్తుంది.

నీటితో చల్లార్చడం
పాలను చల్లగా ఉంచడానికి ఏదైనా తడిగుడ్డను లేదా టవల్​ను పాల గిన్నె చుట్టువైపులా చుట్టండి. నీరు తడి ఆరిపోతే గిన్నె వేడెక్కే అవకాశం ఉంది. అలా తరచూ గుడ్డను తడుపుతూ పాలు వేడెక్కకుండా చూసుకోండి.

మట్టికుండల్లో!
వేడి వాతావరణంలో కూడా ఆహారం చల్లగా ఉండడానికి కొన్ని ప్రాంతాల వారు మట్టి కుండలను ఉపయోగిస్తారు. మట్టి కుండల్లో పెట్టడం వల్ల నీరు ఆవిరి అయిపోతూ ఆహారం చల్లగా ఉంటుంది. అదే విధంగా పాలను కూడా కుండల్లో ఉంచి నిల్వ చేయొచ్చు.

కూలర్
మంచి ఇన్సులేటెడ్ కూలర్ ఉన్న వారికి ఇంకా మంచి సౌకర్యం ఉన్నట్లే. అదేనండీ కూలర్‌లో ఐస్ ముక్కలు వేస్తామే అలాంటిది. కొన్ని ఐస్ ముక్కలను వేసి అందులో పాల గిన్నె ఉంచండి. అవి కరిగే లోగా మరికొన్నింటిని వేస్తూ ఉండండి. అలా చేస్తూ పాల గిన్నె వేడిగా మారకుండా చూసుకుంటే సరి.

దుప్పటి
పాల గిన్నెను టవల్ లేదా దుప్పటితో కప్పేసి చల్లగా ఉంచండి. ప్రత్యేకించి వేడి వాతావరణంలో ఎండ వేడి పరోక్షంగా కూడా తగలనీయకుండా చూడండి.

మీ దగ్గర థర్మామీటర్ ఉందా? అయితే పాలను 7 నుంచి 10 డిగ్రీల సెంటిగ్రేడు (45-50 ఫారన్ హీట్) మధ్య ఉంచేలా చెక్ చేసుకుంటూ ఉండండి. అలా ఉంటే పాలు ఎప్పుడూ తాజాగా ఉంటాయి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పిల్లల ఆయుష్షును పెంచే తల్లి పాలు! బ్రెస్ట్ ​ఫీడింగ్ వల్ల తల్లీబిడ్డలకు ప్రయోజనాలెన్నో! - Benefits Of Breastfeeding

పాలు తాగడానికి సరైన టైమ్ ఏది? ఉదయమా లేక రాత్రా? - Best Time To Drink Milk

ABOUT THE AUTHOR

...view details