Tips To Remove Stains From Clothes :మనం ఎంతో ఇష్టంగా ధరించిన దుస్తులపై కొన్నిసార్లు మరకలు పడుతుంటాయి. అది టీ, ఆయిల్, పండ్ల రసాలు, కూరలు ఇలా ఏవైనా కావొచ్చు. ఇక ఈ మరకలు తొలగించాలంటే తలప్రాణం తోకకు వస్తుంది. అలా అని వాటిని పక్కకూ పెట్టలేం. దీంతో సబ్బు, సర్ఫ్, షాంపూ అంటూ రకరకాలుగా ప్రయత్నిస్తారు. అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మరక మాత్రం పోదు. కొన్నిసార్లు మరక పోవడం అటుంచితే.. రుద్ది రుద్ది దుస్తుల రంగు పోవడం, చినగడం జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే ఈ టిప్స్ పాటించడం వల్ల ఈజీగా మొండి మరకల్ని తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..
నూనె మరకలు :దుస్తులపైలిప్‌స్టిక్, నూనె మరకలు పడితే ఆ ప్రదేశంలో కొద్దిగా గ్లిజరిన్ రాసి ఒక అరగంట తర్వాత వాష్ చేయాలి అని నిపుణులు అంటున్నారు. ఇలా చేస్తే ఈజీగా మరకలను మాయం చేయొచ్చంటున్నారు.
నిమ్మకాయతో :మరకలున్న ప్లేస్‌లో నిమ్మకాయ ముక్క రుద్దడం వల్ల కూడా త్వరగా మరకలను తొలగించుకోవచ్చని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దుస్తుల రంగు కూడా పాడవకుండా ఉంటుందంటున్నారు.
హైడ్రోజన్ పెరాక్సైడ్ :కొన్నిసార్లు బట్టలపై రక్తం లేదా తుప్పు మరకలు పడితే.. ఈ మరకలను తొలగించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరకలున్న చోట కొద్దిగా డిటర్జెంట్ లిక్విడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పోయాలి. తర్వాత బట్టలను ఉతికితే మరకలు తొలగిపోతాయంటున్నారు.
ఉప్పు :దుస్తులపై తుప్పు మరకలుంటే.. వాటిని ఉప్పు నీటిలో నానబెట్టాలి. తర్వాత మరకలున్న చోట రెండు టేబుల్ స్పూన్‌ల నిమ్మరసం వేసి, సబ్బుతో బాగా వాష్‌చేయాలి. ఇలా చేస్తే మరకలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంటి ఫ్లోర్‌పై జిడ్డు మరకలు వదలట్లేదా? - ఈ టిప్స్ పాటిస్తే ఇట్టే తొలగిపోతాయి!