Tips to Remove Oil Stains on Walls:వంట చేసే క్రమంలో గోడలపై మరకలు పడటం కామన్. ముఖ్యంగా వేపుళ్లు, ఇతర కూరల పోపు వేసేటప్పుడు నూనె చిట్లి గోడలపై పడుతుంటుంది. ఇక ఈ మరకలు ఓ పట్టాన వదలవు. క్లీన్ చేయడానికి కాస్తా శ్రమించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు. ఈ టిప్స్ ద్వారా మరకలను ఈజీగా తొలగించుకోవచ్చంటున్నారు. అవేంటో మీరూ తెలుసుకోండి..
బేకింగ్ సోడా: గోడపై ఉన్న నూనె మరకలను ఈజీగా తొలగించడానికి బేకింగ్ సోడా బెస్ట్ హోం రెమెడీ అని నిపుణులు అంటున్నారు. ఇందు కోసం ఒక స్పూన్ బేకింగ్ సోడాను తీసుకుని కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మరక ఉన్న ప్లేస్ అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రమైన వస్త్రం నీటిలో ముంచి ఆ ప్రదేశంలో తుడిస్తే సరి. ఆరిన తర్వాత కొంచెం నూనె మరక కూడా ఉండదంటున్నారు.
2020లో జర్నల్ ఆఫ్ క్లీనింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. గోడలపై వివిధ రకాల నూనె మరకలను తొలగించడంలో బేకింగ్ సోడా ప్రభావవంతంగా ఉందని, గోడలకు ఎటువంటి నష్టం కలిగించదని కనుగొన్నారు. ఈ పరిశోధనలో దిల్లీలోని భారతీయ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ లోని డా. అమృత మిశ్రా పాల్గొన్నారు.
మీ కిచెన్‌లో పొగ ఎక్కువగా వస్తుందా? - ఈ టిప్స్ పాటించారంటే ఆ సమస్య ఉండదు - పైగా గ్యాస్ ఆదా!