Tips For Eyelashes Growth : పెద్ద పెద్ద కళ్లు, చంద్రవంక లాంటి కనుబొమ్మలు, పొడవుగా, చిక్కగా ఉండే కనురెప్పలు! అందంగా కనపడాలంటే ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి? కానీ చాలా మందికి కనురెప్పలు సన్నగా, చిన్నగా ఉంటాయి. ఐల్యాష్ చిన్నగా ఉండటం వల్ల కళ్లు అంత అందంగా కనపడవు. వాటిని పెంచుకునేందుకు చాలా రకాల క్రీములు కూడా తెచ్చుకుని వాడేవారు ఉన్నవారు. క్రీములకు భయపడి ఆర్టిఫీషియల్ ఐల్యాష్ లు పెట్టుకుని తిరిగే వారు కూడా లేకపోలేరు. అయితే ఈ రెండింటి అవసరం లేకుండా కొన్ని సహజ పదార్థాలతో ఇంట్లోనే కను రెప్పలను పొడవుగా, ఒత్తుగా పెంచుకోవచ్చట. అదెలాగో తెలుసుకుందామా!
అలోవెరా
మీ పెరట్లో ఎప్పుడూ ఉండే కలబందను కాస్త కత్తిరించి దాంట్లోని గుజ్జును కనురెప్పలకు రాసుకోవాలి. ఈ గుజ్జులో పుష్కలంగా ఉండే ఖనిజాలు, విటమిన్లు మీ కనురెప్పలు బలంగా, పొడవుగా పెరిగేలా చేస్తాయి. కాకపోతే ఈ గుజ్జు నేరుగా కంట్లోకి వెళ్లకుండా చూసుకోండి.
ఆలివ్ నూనె
మీరు నిద్రపోయే ముందు స్వచ్ఛమైన ఆలివ్ నూనెతో కంటి రెప్పలను సున్నితంగా మసాజ్ చేయండి. ఇది మీ కనురెప్పలకు మంచి పోషణనిచ్చి పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఉదయాన్నే లేచిన వెంటనే చక్కగా కడుక్కోవడం మాత్రం మర్చిపోకండి.
కొబ్బరిపాలు
కొంచెం కాటన్ను ఉండగా చేసి కొబ్బరిపాలలో కాసేపు నానబెట్టండి. తరువాత వాటిని కంటిపై పెట్టుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. కొబ్బరిపాలలో ఉండే ప్రొటీన్లు, కొవ్వులు కనురెప్పల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.