తెలంగాణ

telangana

ETV Bharat / health

చంకలు నల్లగా మారాయా? - ఈజీగా ఇలా చెక్ పెట్టండి!

Tips For Dark Underarms : కొంత మంది చంకలు నల్లగా ఉన్నాయని నూన్యతకు గురవుతుంటారు. దీంతో.. స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లు వేసుకోవాలంటే ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని టిప్స్‌ పాటించడం ద్వారా.. బ్లాక్ అండర్ ఆర్మ్స్ సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Tips For Dark Underarms
Tips For Dark Underarms

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 4:24 PM IST

Tips For Dark Underarms :చాలా మంది అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల్లో బ్లాక్ అండర్ ఆర్మ్స్ ఒకటి. నిజానికి ఇది పెద్ద సమస్య కాకపోయినప్పటికీ.. అమ్మాయిలు ఆత్మనూన్యతకు గురవుతుంటారు. మోడ్రన్‌ స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లు వేసుకోవాలని కోరుకునేవారు.. ఈ సమస్య కారణంగా వాటిని ధరించలేకపోతుంటారు. మరి.. ఇలా చంకల్లో నల్ల రంగు రావడానికి కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలుపాటించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ టిప్స్‌ పాటించండి!

  • చంకలు నల్లగా ఉండటానికి ప్రధాన కారణాల్లో ఊబకాయం ఒకటని నిపుణులు చెబుతున్నారు.
  • ఎత్తుకు అనుగుణంగా కాకుండా.. ఎక్కువగా బరువు ఉంటే కూడా అండర్ ఆర్మ్స్ నల్ల రంగులో ఉంటాయని నిపుణులంటున్నారు.
  • కాబట్టి,అధిక బరువుతో బాధపడేవారు వెయిట్‌ లాస్‌ అయ్యేలా వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు.
  • అలాగే కొంత మంది షేవింగ్ చేసుకున్న తర్వాత దురద సమస్యతో బాధపడతారు. కాబట్టి, చంకల్లో హెయిర్‌ను తొలగించుకోవడానికి వాక్సింగ్ లేదా ఇతర హెయిర్ రిమూవల్ పద్ధతులను ఉపయోగించాలని సూచిస్తున్నారు.
  • చంకల నుంచి దుర్వాసన రాకుండా ఉండటానికి ఉపయోగించే యాంటిపెర్స్పిరెంట్స్, డియోడరెంట్లు చర్మాన్ని ఇబ్బందిపెట్టే ఛాన్స్ ఉంది. ఫలితంగా అక్కడ చర్మం నల్లగా మారేలా చేస్తాయట.
  • కాబట్టి.. ఇలాంటి ప్రొడక్ట్స్ వాడుతున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలని.. కెమికల్స్‌ లేని డియోడరెంట్స్​ ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు.
  • రోజూ స్నానం చేసిన తర్వాత చంకల్లో తడి ఉండకుండా పొడి వస్త్రంతో శుభ్రంగా క్లీన్‌ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందట.
  • కాఫీ, కారం ఎక్కువగా ఉండే పదార్థాలను తినడం వల్ల చంకల్లో ఎక్కువగా చెమట పడుతుందట.
  • దీనివల్ల ఆ ప్రాంతం అంతా నల్లగా మారుతుందని నిపుణులంటున్నారు. కాబట్టి, వీలైనంత వరకు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
  • టైట్‌గా ఉండే డ్రెస్‌లు వేసుకోవడం వల్ల చర్మం రాపిడికి గురవుతుంది. దీనివల్ల కూడా ఆ ప్రాంతం బ్లాక్‌ కలర్‌లోకి మారుతుందట. కాబట్టి కాస్త వదులుగా ఉండే దుస్తులను ధరించండి.
  • విటమిన్ సి, నియాసినామైడ్ వంటి పదార్ధాలు ఉండే క్రీమ్‌లు, సీరమ్‌లను ఉపయోగించడం వల్ల అండర్ ఆర్మ్స్ డార్క్‌ను తగ్గించవచ్చట.
  • స్నానం చేసేటప్పుడు బేకింగ్ సోడా లేదా యాపిల్ సైడర్ వెనిగర్‌తో చంకలను క్లీన్‌ చేసుకోవడం వల్ల నలుపు రంగు తొలగిపోతుందట.
  • వాటర్‌లో బంగాళదుంప ముక్కలను కట్‌చేసి ఒక రెండు నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు ఈ ముక్కలతో చంకల్లో నల్లగా ఉన్న ప్రాంతంలో రుద్దండి.
  • ఇలా తరచూ చేయడం ద్వారా.. బంగాళదుంపలో ఉండే బ్లీచింగ్‌ ఏజెంట్స్‌ నలుపు రంగును తొలగిస్తాయని చెబుతున్నారు.

ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు - మీ కిడ్నీలు పది కాలాల పాటు సేఫ్‌!

ABOUT THE AUTHOR

...view details