Tips Before Medical Check Up :మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల.. నేడు చిన్న వయసులోనే చాలా మందిలో రక్తపోటు సమస్య కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మీరు గనక బీపీ పరీక్ష చేయించుకునేందుకు డాక్టర్ వద్దకు వెళ్లాలని అనుకుంటే.. కనీసం గంట ముందు కాఫీ లేదాకెఫీన్ ఉండే డ్రింక్స్ ఏవీ తాగకూడదని నిపుణులంటున్నారు. ఎందుకంటే.. కెఫిన్ కు రక్తపోటు పెంచే స్వభావం ఉంటుందట. అదేవిధంగా.. బీపీ టెస్ట్ చేసుకునే ముందు బీడీ, సిగరెట్ వంటి పొగాకు ఉత్పత్తులకు సైతం దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
బ్లడ్ టెస్ట్ :
మీరు బ్లడ్ టేస్ట్ చేయించుకునే ముందు ఎక్కువగా కొవ్వు ఉండే ఆహార పదార్థాలను తినకూడదు. దీనివల్ల రిజల్ట్‌లో తేడాలు వస్తాయట. 2015లో ప్రచురించిన 'అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్' నివేదిక ప్రకారం.. మెడికల్ టెస్ట్ చేసుకోవడానికి ముందు ఎక్కువగా కొవ్వు ఉండే ఆహార పదార్థాలను తిన్న వ్యక్తులలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు సగటున 200 mg/dL పెరిగాయని పరిశోధకులు కనుగొన్నారు.
పోహా vs రైస్- ఆరోగ్యానికి ఏది బెటర్? - poha or rice which is better
కొలెస్ట్రాల్ టెస్ట్ :
కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోవాలని అనుకుంటే.. కనీసం 24 గంటల ముందు వరకు మద్యం సేవించకూడదట. అలాగే స్వీట్లు కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలు మారిపోయే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.
స్కిన్ టెస్ట్ :
తామర, అలర్జీ వంటి ఏదైనా ఇతర చర్మ సంబంధిత సమస్యలతో డాక్టర్‌ను కలవాలని అనుకుంటే.. గోర్లకు నెయిల్ పాలిష్ వేసుకోకండి. ఎందుకంటే వారు చర్మాన్ని పరిశీలించడంతో పాటు గోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా ? అనే విషయాన్ని కూడా గమనిస్తారు. కాబట్టి, చర్మవైద్యుడిని కలిసే ముందు నెయిల్ పాలిష్‌కు దూరంగా ఉండండి. అలాగే మేకప్ కూడా వేసుకోకండి.