These Problems Risk Higher In Womens :ఇంట్లో పని ఎక్కువ అవ్వడం, కాస్త బలహీనంగా ఉంటామనే ఉద్దేశంతో ఎలాంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా లైట్ తీసుకుంటుంటారు మహిళలు. కానీ, అలా నిర్లక్ష్యంగా ఉండడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కొన్ని ఆరోగ్య సమస్యలు పురుషలలో కంటే మహిళలనే ఎక్కువ పీడిస్తున్నాయట. వాటికి తక్షణమే చికిత్స తీసుకోకుంటే భవిష్యత్తులో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చంటున్నారు. ఇంతకీ, మగవారి కంటే ఆడవారిని ఎక్కువ ఇబ్బందిపెడుతున్న ఆ సమస్యలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మానవ శరీర నిర్మాణం పురుషులు, మహిళలలో వేరువేరుగా ఉంటుంది. దీని కారణంగా ఆరోగ్యపరంగా ఇద్దరూ విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. అయితే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి కారణంగా పురుషుల కంటే మహిళల్లో వివిధ ఆరోగ్య సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుందట. మగవారితో పోల్చితే ఆడవారు ఒకింత ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని ఇటీవల పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. మహిళల్లో 70 శాతం ఆరోగ్య సమస్యలు ఒత్తిడి మూలంగానే వస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి.
ముఖ్యంగా.. హార్మొనల్ ప్రభావం, సున్నిత మనస్తత్వం, వివిధ రకాల బాధ్యతలుండటం, పెరిగిన వాతావరణంతో మహిళలు అధిక ఒత్తిడితో సతమతం అవుతారని క్లినికల్ సైకియాట్రిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి చెబుతున్నారు. అలాగే.. ఆడవారిలో ఈస్ట్రోజన్, పొజిస్ట్రాన్, బ్రెయిన్‌లో ఉండే కార్టికల్ స్ట్రక్చర్, న్యూరో కెమికల్, న్యూరో ఎండోక్రైన్ సిస్టం భిన్నంగా ఉంటాయంటున్నారు. అందుకే వారు తొందరగా ఒత్తిడికి లోనవుతారని చెబుతున్నారు. అలా.. పెరిగిన ఒత్తిడి వారిని వివిధ ఆరోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుందంటున్నారు.
అలర్ట్ : థైరాయిడ్ ఉంటే గర్భం ధరించలేరా? - వైద్యులు ఏమంటున్నారో తెలుసా!