Symptoms Of Brain Tumor :ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలువస్తున్నాయి. అందులో.. బ్రెయిన్ ట్యూమర్ ఒకటి. మెదడు సమీపంలోని కణాల అసాధారణ పెరుగుదలనే 'బ్రెయిన్ ట్యూమర్' అని అంటారు. ఇది మెదడులోని ఏ భాగంలోనైనా కనిపిస్తుందని, వయసుతో సంబంధం లేకుండా రావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ వ్యాధితో మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే కొన్నిసార్లు మొత్తం మెదడు కణజాలం దెబ్బతింటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఈ వ్యాధితో బాధపడేవారు ముందుగానే కొన్ని లక్షణాలను గుర్తించి.. త్వరగా చికిత్స తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందంటున్నారు. ముఖ్యంగా యువకులలో బ్రెయిన్ ట్యూమర్ ప్రాబ్లమ్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తలనొప్పి :బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడేవారికి తలనొప్పి ఎక్కువగా వస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేచినప్పుడు ఈ సమస్య తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. 2021లో 'జర్నల్ ఆఫ్ న్యూరో-ఆంకాలజీ' అనే జర్నల్‌లో ప్రచురిచితమైన ఒక నివేదిక ప్రకారం.. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారిలో తలనొప్పి ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని 'డ్యూక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్'కు చెందిన 'డాక్టర్ డేవిడ్ ఝాంగ్' పాల్గొన్నారు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వారికి తలనొప్పి ఎక్కువగా వస్తుందని ఆయన పేర్కొన్నారు.
యువకులు స్మోకింగ్‌కు ఎందుకు అలవాటు పడతారు? - దాన్ని ఎలా అడ్డుకోవాలి? - Causes of Nicotine Addiction
కంటి చూపు తగ్గడం :నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడేవారిలో కంటి చూపు తగ్గిపోతుంది. ఎందుకంటే.. బ్రెయిన్ ట్యూమర్ వల్ల కళ్ల నుంచి మెదడుకు సమాచారాన్ని తీసుకెళ్లే ఆప్టిక్ నరాలు దెబ్బతింటాయి. ఫలితంగా కంటి చూపు తగ్గిపోతుందంటున్నారు నిపుణులు.