Sugar Patient Can do Fasting: ఉపవాసం చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఉపవాసంతో బరువు తగ్గడమే కాకుండా.. శరీరంలో గ్లూకోజు నిరోధకత తగ్గి, మధుమేహం బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని Cell Metabolism జర్నల్లో తేలింది. "Early Time-Restricted Feeding Improves Insulin Sensitivity, Blood Pressure, and Oxidative Stress Without Weight Loss in Humans." అనే పేరిట జరిగిన అధ్యయనంలో University of Alabama at Birmingham పరిశోధకులు Erin F. Sutton పాల్గొన్నారు. అలాగే అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, కొలెస్ట్రాల్ స్థాయులూ తగ్గుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రోజులో లేదా వారంలోనో అప్పుడప్పుడు.. ఒక క్రమం ప్రకారం కొన్ని గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటాన్ని వైద్యపరిభాషలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఎన్నో మంచి మార్పులు జరుగుతున్నాయని.. అలాగే జబ్బులను తెచ్చిపెట్టే దుష్ప్రభావాలూ తగ్గుతున్నాయని పరిశోధకులు నిర్థరించారు. దీంతో పాటు అప్పుడప్పుడు చేసే ఉపవాసాల (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్) వల్ల శరీరంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మధుమహంతో బాధపడేవారు ఉపవాసం చేయొచ్చా? అనే ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం బాధితులు సక్రమంగానే తింటున్నా కూడా వాళ్లు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదని నిపుణులు చెబుతున్నారు. అందుకే మధుమేహాన్ని వైద్య పరిభాషలో ఆగ్యుమెంటెడ్ స్టార్వేషన్ అని పిలుస్తుంటారని తెలిపారు. ఈ సమయంలో వీరి శరీరం పిండిపదార్థాలు తీసుకుంటున్నా కూడా కొవ్వు పదార్థాల నుంచే శక్తిని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తుంటుందన్నారు. ఫలితంగా ఈ స్థితిలో 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉంటే ఆగ్యుమెంటెడ్ స్టార్వేషన్ అనేది బాగా పెరుగుతుందని వివరించారు. ఇదే 6 గంటలకంటే ఎక్కువ సమయం ఎలాంటి ఆహారం తినకపోతే శరీరం పూర్తిగా కొవ్వు పదార్థాల మీదే ఆధారపడుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వీరి శరీరంలో ఎసిటాల్డిహైడ్, ఎసిటోన్, బీటా హైడ్రాక్సి బ్యుటిరేట్ అనే ఆమ్ల పదార్థాల స్థాయులు చాలా ఎక్కువైపోతాయని తెలిపారు. ఈ పరిస్థితినే కీటోన్ బోడీస్ అని అంటుంటారు.