Simple Ways to Reduce Sticky Cholesterol:మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ శరీరానికి పోషకాలు, ఖనిజాలు అందించడం చాలా ముఖ్యం. అలాగే బాడీకి కొలెస్ట్రాల్ కూడా అత్యవసరం. అయితే కొలెస్ట్రాల్‌లో LDL (చెడు కొలెస్ట్రాల్), HDL (మంచి కొలెస్ట్రాల్) అనే రెండు రకాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్(Cholesterol) ఎక్కువైతే.. గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా గుండెకు రక్తసరఫరా తగ్గి హార్ట్ ఎటాక్, టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, ఇతర ప్రాణాంతక సమస్యలు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుని.. ఒకవేళ ఎక్కువగా ఉన్నాయంటే ఈ టిప్స్ పాటిస్తే సరి అంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కొలెస్ట్రాల్ లెవల్స్ ఇలా తెలుసుకోండి.. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి ముందస్తు రోగనిర్ధారణ చాలా అవసరం. ఇది ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు బాడీలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కాబట్టి మనమే శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడానికి అప్పుడప్పుడూ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను గుర్తించడంలో సహాయపడతాయి. ఒకవేళ పెరిగితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. మీరు ఆ విధంగా పరీక్షలు చేయించుకున్నప్పుడు కొలెస్ట్రాల్ పెరిగినట్లు తేలితే.. ఈ టిప్స్ ఫాలో అయిపోండి..
జీవనశైలిలో మార్పులు:మీరు అధిక కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నట్లయితే మొదట చేయాల్సిన పని మీ జీవనశైలిలో మార్పులు చేయడం. అంటే సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానాన్ని తగ్గించడం లాంటివి అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.
కొవ్వు పదార్థాలు తీసుకోవడం తగ్గించడం:శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే మీరు చేయాల్సిన మరో పని.. మీ డైట్లో సంతృప్త కొవ్వులు తగ్గించడం. ఈ కొవ్వులు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వేయించిన ఆహారాలలో ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది. ఇవి ఆరోగ్యకరమైన లిపిడ్ ప్రొఫైల్‌కు దోహదం చేయడంతో పాటు ధమనులలో పూడికలు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? - ఈ కూరగాయలు తింటే ఈజీగా వెయిట్ లాస్!