Signs Of High Blood Sugar :మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, జన్యువులు వంటి వివిధ కారణాల వల్ల నేడు చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక్కసారి ఒంట్లోకి షుగర్ వ్యాధి చేరిందంటే చాలు, దాన్ని అదుపులో ఉంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అందుకే ఈ డయాబెటిక్ పేషెంట్లు ఏ ఆహారం తినాలన్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తుంటారు. అయితే, షుగర్ వ్యాధి ఉన్న వారిలో చక్కెర స్థాయిలు ఎక్కువైతే అధికంగా మూత్రవిసర్జన చేయడం, జీర్ణ సమస్యలు వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని మనందరికీ తెలిసిందే. కానీ.. వీరిలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతేకంటి ద్వారా కూడా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో మీకు తెలుసా?
రక్తనాళాలు దెబ్బతింటాయి :
శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగితే కంటి రెటీనాలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో కళ్లు ఉబ్బుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కంటి నుంచి ద్రవం కారుతుందని అంటున్నారు. దీనివల్ల వారు సరిగ్గా చూడలేరని, వస్తువులను గుర్తించలేరని అంటున్నారు. ఈ లక్షణాలు ఒక కంటిలో లేదా రెండు కళ్లలోనూ కనిపించవచ్చని చెబుతున్నారు. ఇది దీర్ఘకాలం కొనసాగితే కంటిలోని చిన్న రక్తనాళాలు దెబ్బతిని చూపు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే.. షుగర్ వ్యాధి ఉన్న వారికి కంటిశుక్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇంకా ఆప్టిక్ నాడి దెబ్బతినడం వల్ల వచ్చే గ్లకోమా సమస్య కూడా ఎటాక్ అవుతుందని చెబుతున్నారు.
పరిశోధన వివరాలు :
2017లో JAMA (The Journal of the American Medical Association) Ophthalmology జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్న షుగర్ పేషెంట్లలో కళ్లు ఉబ్బడం, కళ్లలో నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారట.