Hair Perfumes Can Cause Health Risks :కొందరుపార్టీలకు వెళ్తే.. ఇంకొందరు ఫంక్షన్లకు వెళ్తే.. మరికొందరు ఇంటి నుంచి అడుగు బయట పెడితే.. హెయిర్ ఫెర్ఫ్యూమ్స్‌ని తెగ వాడేస్తుంటారు. నలుగురిలో తామే స్పెషల్ ఎట్రాక్షన్గా నిలవాలని ఆరాటపడుతుంటారు. మీక్కూడా ఇలాంటి హెయిర్ ప్రొడక్ట్స్ వాడే అలవాటు ఉందా? అయితే.. మీరు అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. వాటిని యూజ్ చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచికాదని, ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పరిమళాలు వెదజల్లే హెయిర్ పెర్ఫ్యూమ్స్ ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్నీ అందించినప్పటికీ.. ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావంటున్నారు నిపుణులు. వీటిల్లో ఇథైల్ ఆల్కహాల్, భారీ సింథటిక్ సువాసనలతోపాటు పలు రసాయనాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వీటి వల్ల స్కాల్ఫ్ డ్యామేజ్ అవుతుందని చెబుతున్నారు. పొడిబారినట్లుగా మారుతుందంటున్నారు.
దీంతోపాటు అవి జుట్టు(Hair) ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. హెయిర్ పెర్ఫ్యూమ్స్లో ఉండే ఆల్కహాల్ జుట్టులోని సహజ నూనెలను దెబ్బతీసి.. వెంట్రుకలను పొడిగా, పెళుసుగా మారుస్తాయంటున్నారు. దాంతో జుట్టు చివర్లు ఎక్కువగా చిట్లిపోయి.. నిర్జీవంగా మారిపోతాయని చెబుతున్నారు. అలాగే.. జుట్టు రాలే సమస్య పెరుగుతుందని అంటున్నారు. కాబట్టి.. సాధ్యమైనంత వరకూ హెయిర్ పెర్ఫ్యూమ్స్కు దూరంగా ఉండడం మంచిదంటున్నారు. అందుకు బదులుగా కొన్ని సహజసిద్ధమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు.
మీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకుంటున్నారా? - ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ గ్యారెంటీ!