High Cholesterol Persons Eating Eggs Side Effects :పట్టణ జీవన విధానంలో చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో.. అధిక కొలెస్ట్రాల్(High Cholesterol) ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు.. తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే.. ప్రాణాలకే ప్రమాదంగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ, హై కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎగ్స్ తింటే ఏమవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరుగుతుంది :హై కొలెస్ట్రాల్ ఉన్నవారికి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అలాంటిది వారు డైలీ ఎగ్స్ తినడం వల్ల అందులో ఉండే కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి వీలైనంత వరకు కొలెస్ట్రాల్ ఉన్నవారు గుడ్లు ఎక్కువగా తినకపోవడం మంచిది అంటున్నారు.
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవచ్చు :మీరు ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడుతుంటే రెగ్యులర్‌గా గుడ్లు తినకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఎగ్స్ అందులో ముఖ్యంగా పచ్చసొనలో హై కొలెస్ట్రాల్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వీటిని తినడం వల్ల ఎల్డీఎల్ స్థాయిలు మరింత పెరిగి.. హార్ట్ ప్రాబ్లమ్స్‌కు దారి తీసే ప్రమాదం ఉదంటున్నారు. 2019లో నిర్వహించిన 'Journal of the American Medical Association'అనే అధ్యయనం ప్రకారం.. 12 వారాల పాటు రోజుకు ఒక గుడ్డు తిన్న వ్యక్తులు, గుడ్లు తినని వ్యక్తుల కంటే ఎక్కువ LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉన్నారని కనుగొన్నారు.
నాన్‌వెజ్ తింటే కొలెస్ట్రాల్ - తినకుండా ఉండలేం ఎలా బ్రో? - ఇవి లాగించండి బ్రో!