తెలంగాణ

telangana

ETV Bharat / health

మీతో మీరు మాట్లాడుకుంటే - స్ట్రెస్​ మొత్తం మటుమాయం! - benefits of self talk

Self Talk Benefits: మనలో మనం మాట్లాడుకోవడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. చాలా మంది తమలో తాము మాట్లాడుకుంటుంటారు. దానినే స్వీయ సంభాషణ(Self Talk) అంటారు. ఇది సానుకూలంగా లేదా ప్రతికూలంగా, ప్రోత్సాహకరంగా లేదా విమర్శనాత్మకంగా ఉండవచ్చు. అయితే ఈ సెల్ఫ్​ టాక్​ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Self Talk Benefits
Self Talk Benefits

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 10:18 AM IST

Updated : Jan 29, 2024, 1:44 PM IST

Self Talk Benefits:మన ఆలోచనలే మన ఫ్యూచర్​ను నిర్ణయిస్తాయి అంటారు మానసిక నిపుణులు. అందుకే.. మనం ఆలోచించే విధానం ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలని సూచిస్తుంటారు. అయితే.. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకూ ఎన్నో నెగెటివ్ అంశాలు మన మనసుపై ప్రభావం చూపిస్తాయి. అలాంటి వాటి నుంచి బయటపడేందుకు.. మనతో మనం ఉత్సాహంగా కమ్యూనికేట్ అయ్యేందుకు.. Self Talk ఎంతో ప్రయోజనంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సెల్ఫ్​ టాక్​ వల్ల కలిగే మేలేంటి? అసలు మనం మనతో ఎలా మాట్లాడుకోవాలి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

ఉదయాన్నే ఈ అలవాట్లను పాటిస్తే - మీరు 100 ఏళ్లు జీవించడం ఖాయం!

నెగెటివ్ సెల్ఫ్ టాక్ : మనతో మనం మాట్లాడుకోవడం అనే పద్ధతిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి నెగెటివ్, రెండోది పాజిటివ్. అయితే.. చాలా మంది నెగెటివ్ మోడ్​లోనే తమతోతాము మాట్లాడుకుంటారు. "ఇలా ఎందుకు జరిగింది? అలా జరిగితే బాగుండు.. ఇక మన పని అయిపోయినట్టేనా?" అంటూ.. మనసులో నెగెటివ్ ఆలోచనలతో కుమిలిపోతుంటారు. ఒత్తిడికి లోనవుతుంటారు. ఇది మానసిక ప్రవర్తనపై మరింత ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే.. అందరూ పాజిటివ్ సెల్ఫ్ టాక్​ను అలవాటు చేసుకోవాలి.

పాజిటివ్​ టాక్​: ఉదయాన్నే అద్దం ముందుకు వెళ్లండి. మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఓపెన్​గా మాట్లాడుకోండి. మనసులో కాదు.. బయటకు మాట్లాడండి. ఇవాళ మనకు అద్భుతంగా ఉండబోతోంది అని చెప్పుకోండి. పలానా పని పూర్తి చేసేద్దాం అనుకోండి. నిన్న పలానా విషయంలో నష్టం జరిగిందా.. లైట్​ తీస్కో బాస్ ఇవాళ చూస్కుందాం.. అంటూ మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకోండి. మీలోని స్ట్రెంథ్​ గురించి చెప్పుకుంటూ తప్పక సాధిస్తామని అనుకోండి. అనంతరం పనిలోకి వెళ్లిన తర్వాత అనుకున్నవి జరగకపోవచ్చు.. అప్పుడు కూడా మీకు మీరు ఏం పర్వాలేదని చెప్పుకోండి.

మెరుగైన ఆత్మవిశ్వాసం:పాజిటివ్​ సెల్ఫ్​ టాక్​.. సానుకూల మనస్తత్వాన్ని పెంపొందిస్తుంది. మీపై మీకు విశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. సమస్యలు ఏవి ఎదురైనా పదా చూస్కుందాం అనే స్థాయికి చేరుతారు. సెల్ఫ్​టాక్​ ధైర్యంగా అడుగులు వేయడానికి, సవాళ్లని స్వీకరించడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది.

మెదడు మొద్దుబారితే ప్రమాదం - ఇలా చేస్తే ఫుల్ యాక్టివ్​ అయిపోతుంది!

ఒత్తిడి తగ్గింపు :ఒత్తిడి తగ్గించడానికి అద్భుతమైన మెడిసిన్​గా పాజిటివ్​ సెల్ఫ్​ టాక్​ పనిచేస్తుంది​. నెగెటివ్ స్వీయ సంభాషణ మీ ప్రెజర్​ను మరింతగా పెంచితే.. పాజిటివ్ సెల్ఫ్ టాక్​ అనేది మీలో ప్రేరణను కలిగిస్తుంది. మరింత నమ్మకం పెంచడం ద్వారా పట్టుదలతో ముందుకు సాగడానికి సాయపడుతుంది. ఈ స్థితికి చేరినప్పుడు అనివార్యంగా మనసులో ఒత్తిడి తగ్గిపోతుంది. పాజిటివ్ సెల్ఫ్ టాక్‌లో పాల్గొనడం వల్ల.. అథ్లెట్స్‌ ఆట తీరులో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుందని ఓ అధ్యయనం కనుగొంది.

టాలెంట్​కు మెరుగులు :ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉన్నవారిలో ఉత్సాహం రెండింతలు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు ఉత్సాహంగా పనిచేస్తారు. తద్వారా.. వారి టాలెంట్​ మరింత పదునెక్కుతుంది. అలాగే నిర్ణయాలు తీసుకునే నైపుణ్య పెరుగుతుంది. సెల్ఫ్​టాక్​ను అలవాటుగా మార్చుకున్నప్పుడు.. పరిస్థితులను పూర్తిగా అంచనా వేయగలుగుతారు.

ఈ టిప్స్ పాటిస్తే - రోజంతా హ్యాపీగా!

బంధాలపై సానుకూల ప్రభావం:మనతో మనం మాట్లాడుకునే విధానం వల్ల మనం ఉత్సాహంగా తయారవుతాం. దాంతో.. ఆటోమేటిగ్గా పక్కవారితోనూ అంతే ఉత్సాహంగా మాట కలుపుతాం. ఫలితంగా.. సానుకూల ప్రభావం పెరుగుతుంది. బంధాలు మరింత బలంగా తయారవుతాయి.

ప్రేరణ, లక్ష్య సాధన:పాజిటివ్​ సెల్ఫ్​ టాక్​ అనేది.. మీకు మంచి ప్రేరణగా పనిచేస్తుంది. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకునేలా, మీ బలాలపై దృష్టి పెట్టేలా చేస్తుది. తద్వారా మీ టార్గెట్ రీచ్ కావడానికి కావాల్సిన ఇంధనం మీకు లభిస్తుంది.

ఆరోగ్యం :మరో ముఖ్యమైన అంశం ఆరోగ్యం. సెల్ఫ్ టాక్ ద్వారా.. మానసిక ఆరోగ్యం చాలా మెరుగు పడుతుంది. డిప్రెషన్, నెగెటివిటీ దూరమైపోతాయి. దాంతో.. శారీరకంగా కూడా ఉల్లాసంగా ఉంటారు. సంతోషకరమైన జీవితం కొనసాగుతుంది. చూశారు కదా.. ఇన్నివిధాలుగా మేలు చేసే ఈ పాజిటివ్ సెల్ఫ్ టాక్​ను మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు నుంచే...

బీ అలర్ట్​ - ఈ ఆహారాలను ఎక్కువగా ఉడికిస్తున్నారా? - క్యాన్సర్​ వచ్చే అవకాశం!

Last Updated : Jan 29, 2024, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details