Relation Between Salt and Gastric Cancer: ఉప్పు లేకపోతే వంటలకు రుచి రాదు. అదే సమయంలో ఉప్పు ఎక్కువ తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా.. రక్తపోటు పెరగడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయితే.. క్యాన్సర్ కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా చాలా మంది కూరలో ఉప్పు తక్కువైతే అన్నం తినేటప్పుడు కలుపుకుంటుంటారు. అయితే ఇలా చేయడం వల్ల జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్టు ఓ అధ్యయనంలో బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో జీర్ణాశయ క్యాన్సర్ ఐదోది. దీని ముప్పు కారకాలను గుర్తించటానికి డాక్టర్లు, నిపుణులు ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యయనం ఒక కొత్త విషయాన్ని వెల్లడించింది.
భోజనానికి కూర్చున్నప్పుడు అదనంగా అసలే ఉప్పు కలపని, ఎప్పుడో గానీ ఉప్పు వేసుకునేవారితో పోలిస్తే తరచూ ఉప్పు కలిపి తినేవారికి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ముప్పు 41% ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. జీర్ణాశయం లోపల జిగురుపొరను ఉప్పు దెబ్బతీస్తుంది. ఇది హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి దోహదం చేస్తుంది. ఇది ఇన్‌ఫెక్షన్ తలెత్తటానికే కాకుండా జీర్ణాశయ పైపొర కణాలను దెబ్బతీయటం వంటి చర్యలతో క్యాన్సర్ ముప్పూ పెరిగేలా చేస్తుంది. కాబట్టి జీర్ణాశయ క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవటానికి ఉప్పు తక్కువగా వాడటం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు అధికంగా గలవారికిది మరింత ముఖ్యమని వివరిస్తున్నారు.
2011లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. అధిక, మధ్యస్తంగా ఉప్పు తీసుకునే వ్యక్తులకు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో సియోల్ నేషనల్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ డాక్టర్ డేహీ కాంగ్ పాల్గొన్నారు. ఇదే విషయాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ బృందం(రిపోర్ట్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి) కూడా వెల్లడించింది.
ఇతర ఆరోగ్య సమస్యలు: