Reasons for Tired in Early Morning:ఉదయాన్నే తాజాగా నిద్ర లేవాలి. అప్పుడే.. మనసుతోపాటు శరీరం కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. కొన్నిసార్లు రాత్రి నిద్ర సరిపోకపోవడం వల్ల ఈ సమస్య రావొచ్చు. మళ్లీ తగినంత నిద్రపోతే ఈ సమస్య సెట్ అయిపోతుంది. కానీ.. 7 నుంచి 8 గంటలు పడుకున్నా కూడా.. ఉదయం అలసట, చిరాకు వంటి ఫీలింగ్స్ ఫేస్ చేస్తున్నారంటే.. కచ్చితంగా కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు నిపుణులు!
ఆందోళన:ఈ పరిస్థితికి మొదటి కారణం ఆందోళన. ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలన్నీ మానసిక అలసటకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు.
పరిష్కారం:ఈ సమస్యను నుంచి బయటపడడానికి ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లడం, బిగ్గరగా నవ్వడం, డ్యాన్స్ చేయడం, మీ మనసుకు నచ్చిన వారితో సమయం గడపడం వంటివి చేయాలి. "అరిజోనా స్టేట్ యూనివర్శిటీ" నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువ సామాజిక కార్యకలాపాలలో నిమగ్నమైన విశ్వవిద్యాలయ విద్యార్థులు మరుసటి రోజు తక్కువ కార్టిసోల్ స్థాయిలను ప్రదర్శించారని, మెరుగైన నిద్రపోయారని పేర్కొన్నారు.
విటమిన్ డెఫీషియన్సీ:శరీరంలో విటమిన్లు సరిపడా లేకపోయినా కూడా నిద్ర లేచిన తర్వాత అలసటకు గురవుతారని నిపుణులు అంటున్నారు. శరీరంలో జరిగే అనేక రసాయన ప్రక్రియలకు విటమిన్లు సహాయపడతాయి. కణాల పెరుగుదల, నిర్వహణ, జీవక్రియ, ఇమ్యూన్ సిస్టమ్ పనితీరుకు సపోర్ట్ చేస్తాయి. ఇలాంటి విటమిన్లు తగ్గితే కూడా నిద్ర సమస్యలు వస్తాయి.
పరిష్కారం:మాంసాహారులకు, విటమిన్ B12 (ఇది చికెన్, గుడ్లు, చేపలలో లభిస్తుంది) పొందడం కష్టం కాదు. ఇక శాకాహారులైతే విటమిన్ బి12 సప్లిమెంట్లతో పాటు పాలు, చీజ్, పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు అందుతాయి.