తెలంగాణ

telangana

ETV Bharat / health

మీకు కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత - కొబ్బరి తినే అలవాటు ఉందా? - ఏం జరుగుతుందో తెలుసా! - Raw COCONUT HEALTH PROBLEMS - RAW COCONUT HEALTH PROBLEMS

Raw Coconut Health Issues : సమ్మర్​లో చాలా మంది వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. అలా తాగాక కొందరికి అందులోని కొబ్బరి తినే అలవాటు ఉంటుంది. మీక్కూ ఈ అలవాటు ఉందా? అయితే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు!

Coconut
Raw Coconut Health Issues

By ETV Bharat Telangana Team

Published : Apr 23, 2024, 1:21 PM IST

Do You Eat Coconut After Drinking Coconut Water? :చాలా మందికి కొబ్బరి బోండంలోని నీళ్లు తాగిన తర్వాత.. అందులో ఉండే కొబ్బరి(Coconut) తినే అలవాటు ఉంటుంది. మీకు ఇలా తినే హ్యాబిట్ ఉందా? ఉంటే ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • కొబ్బరి బోండం నీటిలో అత్యధికంగా కేలరీలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అలాగే ఫైబర్ ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే.. కొబ్బరిలో మాత్రం కోకోనట్ వాటర్ కంటే కాస్త ఫైబర్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని, గట్​ సిస్టమ్​ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అదేవిధంగా జీర్ణ సమస్యలు, ప్రకోప పేగు సిండ్రోమ్ వంటి సమస్యలు తలెత్తకుండా కాపాడుతుందని చెబుతున్నారు.
  • ఇకపోతే.. కొబ్బరిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయనే విషయం మీరు గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. ఇది బరువు పెరగడానికీ సహాయపడుతుందంటున్నారు. కాబట్టి, కొబ్బరి తినేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
  • 2016లో "అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్" జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. పచ్చి కొబ్బరి ఎక్కువగా తినే వ్యక్తులు బరువు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బ్రెజిల్​లోని 'ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ రియో డి జెనీరో'కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ వాండర్లీ డి పౌవా పాల్గొన్నారు. కొబ్బరిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులో అధికంగా ఉండే కేలరీలు బరువు పెరగడానికి తోడ్పడవచ్చని ఆయన పేర్కొన్నారు.

కొబ్బరినీళ్లు ఏ టైమ్​లో తాగాలో తెలుసా?

  • అలాగే.. కొబ్బరి తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులంటున్నారు. ఫలితంగా వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల మీకు ఇప్పటికే ఏవైనా సమస్యలు ఉంటే నిపుణుల సలహాతో కొబ్బరి తినడం మంచిదని సూచిస్తున్నారు.
  • ముఖ్యంగా కొబ్బరి నూనె, కొబ్బరి పామ్ పుప్పొడి, కొబ్బరి ఉత్పత్తుల అలర్జీ ఉన్నవారు కొబ్బరిని తినకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఒక వ్యక్తి రోజుకు 40 గ్రాముల కొబ్బరిని తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
  • ఖాళీ కడుపుతో కూడా కొబ్బరిని తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచే జరుగుతుందంటున్నారు. ఎందుకంటే.. కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్​లో ఉంచడానికి, రోజంతా యాక్టివ్​గా ఉండేలా శక్తిని అందించడంలో సహాయపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య, మానసిక నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కొబ్బరి నీళ్లు Vs లెమన్‌ వాటర్‌- సమ్మర్​లో ఏ డ్రింక్​ బెస్ట్​! నిపుణుల మాటేంటి!

ABOUT THE AUTHOR

...view details