తెలంగాణ

telangana

ETV Bharat / health

క్షణాల్లో టిఫెన్స్​ రెడీ - టేస్ట్​ అండ్​ హెల్త్​ కూడా సూపర్​!

Quick And Healthy Breakfast : మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్ ప్రిపేర్​​ చేసే టైం లేదా..? బయట నుంచి తెప్పించుకుని తింటున్నారా..? అయితే ఇకపై అలా చేయనవసరం లేదు. కేవలం క్షణాల్లో తయారయ్యే బ్రేక్​ఫాస్ట్​ ఐటమ్స్​ మీ కోసం తీసుకొచ్చాం. మరి వాటి కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేసి మీరు ట్రై చేయండి..

Quick And Healthy Breakfast
Quick And Healthy Breakfast

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 7:31 PM IST

Quick And Healthy Breakfast :నేటి ఉరుకుల పరుగల జీవితంలో టైం లేదంటూ చాలా మంది ఇంట్లో బ్రేక్​ఫాస్ట్​ను ప్రిపేర్​ చేయడం లేదు. వెళ్లే దారిలో ఎక్కడో హోటల్ లేకుంటే మొబైల్​ క్యాంటీన్స్​ దగ్గర తినేస్తున్నారు. అలాంటి వారి కోసమే క్షణాల్లో రెడీ అయ్యే బ్రేక్‌ఫాస్ట్‌ ఐటమ్స్‌ తీసుకొచ్చాం. ఇవి చేయడం వల్ల టైం సేవ్​ అవ్వడమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు ఉన్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

రాగి దోశ :చాలా మంది బియ్యపిండితో దోశలు వేసుకుంటారు. అలాకాకుండా ఈ సారి రాగి పిండితో దోశ ట్రై చేయండి. ఇది చేయడం కూడా ఈజీ. కొద్దిగా రాగి పిండిని తీసుకుని నీళ్లు పోసుకుంటూ దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఈ పిండిలోకి కొద్దిగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, ఉప్పు యాడ్‌ చేసుకుని దోశల్లా పోసుకుంటే బ్రేక్​ఫాస్ట్​ రెడీ. రాగిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలు ఆరోగ్యాంగా ఉండేలా చేస్తుంది.

బీట్‌రూట్‌ బేసన్ చీలా (Besan Cheela with beetroot) :ఫాస్ట్‌గా రెడీ అయ్యే బ్రేక్‌ఫాస్ట్‌ రెసిపీల్లో బీట్‌రూట్‌ బేసన్‌ చీలా ఒకటి. దీని కోసం ముందుగా బీట్‌రూట్‌ను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగ పిండి వేసుకుని కలుపుకోవాలి. ఇందులోకి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు, కట్‌ చేసిన పచ్చిమిర్చి వేసి కొన్ని నీళ్లు పోసుకుంటూ దోశల పిండిలా కొద్దిగా కలుపుకోవాలి. తర్వాత పెనంపై ఈ మిశ్రమాన్ని వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే సింపుల్‌ బీట్‌రూట్‌ బేసన్‌ చీలా రెడీ. బీట్‌రూట్‌ను తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.

మేతి తేప్లా రోల్స్ (Methi Thepla Rolls) :మేతి తేప్లా రోల్స్‌ తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఇందులోకి 1/2 కప్పు సన్నగా తరిగిన మెంతి ఆకులు, కొద్దిగా శనగ పిండి, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలుపుకోండి. ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేసుకోవచ్చు. తర్వాత చపాతీల లాగా చేసుకుని పెనంపై వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే మేతి తేప్లా రోల్స్‌ రెడీ. షుగర్‌ బాధితులు ఈ చపాతీలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

మఖానా గంజి (Makhana Porridge) :ఉదయాన్నే టిఫెన్‌ చేయకుండా ఏదైనా ఎనర్జీ డ్రింక్‌ తాగాలనుకునే వారికి మఖానా గంజి బెస్ట్ ఆప్షన్. ముందుగా ఒక కప్పు మఖానాను రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత ఉదయాన్నే నీళ్లను వేరుచేసి మఖానాను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పాలను, తేనెను కలిపి తాగాలి. మఖానా గంజిని తాగడం వల్ల రోజంతా శక్తి ఉంటుందని అంటున్నారు.

క్వినోవా ఉప్మా (Quinoa Upma) :గోధుమ రవ్వతో అందరికీ ఉప్మా చేయడం వచ్చు. అయితే, ఈ సారి కొత్తగా క్వినోవాతో ఉప్మాను ట్రై చేయండి. ఇది కూడా తొందరగానే కంప్లీట్​ అవుతుంది. అంతేకాకుండా ఇది తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్​ లభిస్తాయి.

కర్డ్​రైస్​ :ఇది కూడా తొందరగా రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు అన్నంలో పెరుగు, తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత పోపు పెట్టి అన్నంలో కలుపుకుంటే సరిపోతుంది. కర్డ్​ రైస్​ రెడీ. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగపడేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

క్షణాల్లో తయారయ్యే టిఫెన్స్ - ఈ 5 రకాల రుచులు టేస్ట్ చేశారా?

బరువు తగ్గాలనుకుంటున్నారా? బ్రేక్​ఫాస్ట్​లో ఈ కాంబినేషన్స్​ ట్రై చేయండి!

బ్రేక్ ఫాస్ట్​లో గుడ్డు తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details