తెలంగాణ

telangana

ETV Bharat / health

అధిక బరువు ఉన్న మహిళలకు పిల్లలు పుట్టరా? డాక్టర్లు ఏం చెబుతున్నారు? - Link Between Obesity andInfertility

Obesity Pregnancy Complications : స్థూలకాయంతో చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే అధిక బరువు ఉండే మహిళలకు సంతానం కలగడం కష్టమా? దీనికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

obesity and pregnancy facts
Myths and Truths of Obesity and Pregnancy

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 7:16 AM IST

Obesity Pregnancy Complications :మహిళలు గర్భం దాల్చాలంటే నెలసరి క్రమం తప్పకుండా రావాలి. అలాగే అండాల విడుదల సరిగ్గా ఉండాలి. అప్పుడే సంతాన సాఫల్యతకు వీలుంటుంది. అయితే మహిళల్లో అధిక బరువుతో బాధపడేవారు ఈ నెలసరి సరిగ్గా రాక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. వాస్తవానికి స్థూలకాయం వల్ల హార్మోన్ల ఉత్పత్తి సరిగ్గా జరగదు. ఫలితంగా అండం ఉత్పత్తి క్రమంగా జరగదు. కొన్నిసార్లు పురుష హార్మోన్లు విడుదల అవ్వడం వల్ల కూడా నెలసరి సరిగా రాదు. మరికొందరికి అండమే విడుదల కాదు. ఇలాంటి కారణాల వల్ల మహిళల్లో గర్భధారణ సమస్య తలెత్తుతుంది. అధిక బరువుతో బాధపడే మహిళలు పీసీవోడీతోనూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. పిసీవోడీల వల్ల గర్భంలో నీటి తిత్తులు ఏర్పడి నెలసరి క్రమాన్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల సంతాన సాఫల్యతకు అవరోధాలు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు.

పీసీవోడీ సమస్యతో గర్బధారణ కష్టమే
స్థూలకాయంతో బాధపడేవారు ఎక్కువగా పీసీవోడీ సమస్యకు గురికావచ్చు. అధిక బరువు వల్ల పీరియడ్స్ రెండు మూడు నెలలకు ఒకసారి వస్తుంటాయి. ఇక పీసీవోడీ వల్ల మహిళల్లోనూ, పురుష హర్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి. దీని వల్ల అండం విడుదల ఆగిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే గర్బం కోసం ఎదురుచూసే మహిళలు ముందుగా బీఎంఐని తగ్గించుకోవడంపై దృష్టిపెట్టాలి. 20 నుంచి 25 శాతం మధ్య బీఎంఐ ఉంటేనే సంతాన సాఫల్యత అవకాశాలు మెండుగా ఉంటాయని అంటున్నారు.

పురుషుల్లో అధిక బరువు వల్ల నష్టమే
భార్యభర్తల్లో ఏ ఒక్కరు స్థూలకాయంతో బాధపడినా పిల్లలు కలిగే అవకాశాలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. మహిళలు అధిక బరువు ఉండటం వల్ల అండం ఉత్పత్తి తగ్గుతుంది. పురుషులు అధిక బరువు ఉండటం వల్ల వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. అంతేకాకుండా వీర్యకణాలను ఉత్పత్తి చేసే వృషణాల్లో వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని డాక్టర్లు చూపుతున్నారు. కాబట్టి ఏ విధంగా చూసినా అధిక బరువును అడ్డుకట్ట వేస్తేనే సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు. తినే ఆహారంలోనూ, శారీరక శ్రమ చేయడంలోనూ తగిన శ్రద్ధ తీసుకుంటే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అధిక బరువు అనేది భార్యాభర్తలు ఇద్దరిలోనూ హార్మోన్ల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కనుక సంతాన సాఫల్యతకు బరువును తగ్గించుకోవడం ఒక్కటే మార్గమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

మీ దాంపత్యం​ రొమాంటిక్​గా ఉండాలంటే - ఇలా చేయండి!

ఆఫీసులో ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? - హెల్దీగా ఉండటానికి ఇలా చేయండి!

ABOUT THE AUTHOR

...view details