Natural Facials For Beautiful Skin :అందంగా కనిపించాలని కోరుకోని వారు ఎవరూ ఉండరు. అందుకోసం రోజూ ఎన్నో రకాల కాస్మెటిక్ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అలాగే బ్యూటీపార్లర్‌లకు వెళ్లి తమ అందానికి మెరుగులు దిద్దుకుంటుంటారు. అయితే, ఇలా ముఖానికి మేకప్‌లు, ఫేషియల్‌లు ఎన్ని సార్లు చేసుకున్న సరే.. ఆ అందం ఎక్కువ రోజులు ఉండదు. పైగా కొందరిలో తరచుగా మేకప్ వేసుకోవడం వల్ల ముఖంపైమొటిమలు వస్తుంటాయి. అయితే ఈ సమస్యలన్నింటికి పరిష్కారంగా నిపుణులు కొన్నిఫేస్‌ప్యాక్స్ ట్రై చేయమని సూచిస్తున్నారు. వీటి కోసం అధికంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని.. కేవలం కిచెన్ లభించే కొన్ని పదార్థాలతో అందంగా మారొచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఫేస్‌ప్యాక్స్ ఏంటో చూసేద్దామా ?
గుమ్మడిపండుతో ఫేస్‌ప్యాక్ :
కావాల్సినవి :
- బాగా పండిన గుమ్మడి పండు గుజ్జు - 2 టేబుల్ స్పూన్‌లు
- తేనె - అర చెంచా
- పాలు - అర చెంచా
- దాల్చినచెక్క పొడి - పావు చెంచా
తయారీ విధానం :బాగా పండిన గుమ్మడి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి తేనె, పాలు, దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.
ఫేషియల్ ఇలా :
- ముందుగా ముఖాన్ని చల్లటి నీళ్లతో కడుక్కుని కొద్దిసేపు ఆరనివ్వాలి.
- తర్వాత గుమ్మడిపండు మిశ్రమాన్ని ఫేస్‌ప్యాక్‌లాగా అప్లై చేసుకోవాలి.
- ఒక 15 నుంచి 20 నిమిషాల తర్వాత.. చల్లని నీళ్లతో క్లీన్ చేసుకుని మెత్తటి క్లాత్‌తో తుడుచుకోవాలి.
- ఇలా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ ఫేస్‌ప్యాక్‌ను ట్రై చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయని నిపుణులంటున్నారు. ఇంకా చర్మం మెరుస్తుందని చెబుతున్నారు. గుమ్మడి పండులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
2014లో "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. మొటిమల సమస్యతో బాధపడేవారు గుమ్మడిపండు గుజ్జును ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల.. సమస్య తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో దిల్లీలోని "దిల్లీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్"లో పనిచేసే డాక్టర్. సునీల్ కుమార్ పాల్గొన్నారు. మొటిమలతో బాధపడేవారు వారు గుమ్మడిపండు గుజ్జును అప్లై చేసుకోవడం వల్ల మొటిమలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.
కోడిగుడ్డు ఫేస్‌ప్యాక్ :
కావాల్సినవి:
- కోడిగుడ్డు - ఒకటి
- నిమ్మరసం - ఒక చెంచా
- పెరుగు - ఒక చెంచా
తయారీ విధానం :ఫస్ట్ గుడ్డులోని తెల్ల సొనను వేరు చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.
ఫేషియల్ ఇలా ట్రై చేయండి!
- ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆరనివ్వాలి.
- తర్వాత కోడిగుడ్డు మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేసి దాదాపు 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
- ఇప్పుడు గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
- ఇలా ఒక వారం రోజుల పాటు ఈ ఫేస్‌ప్యాక్‌ను అప్లై చేసుకోవడం వల్ల చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి కోమలంగా తయారవుతుందని నిపుణులు పేర్కొన్నారు.
ఈస్ట్ పౌడర్ ఫేస్‌ప్యాక్ :