Mixed Vegetable Salad For Weight Loss : ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం వంటి వివిధ కారణాల వల్ల అధిక సంఖ్యలో జనాలు బరువు పెరిగిపోతున్నారు. ఇలా అధిక బరువుతో బాధపడేవారు వెయిట్‌లాస్ అవ్వడానికి రోజూ వ్యాయామాలు చేయడంతో పాటు, కఠినమైన డైట్‌ను పాటిస్తుంటారు. అయినా కొన్నిసార్లు ఫలితం ఉండదు. అలాంటప్పుడు బరువు ఎక్కువగా ఉన్న వారు డైట్‌లో మిక్స్‌డ్ వెజిటబుల్ సలాడ్ తినడం వల్ల వెయిట్ లాస్‌కు అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులంటున్నారు. మరి మిక్స్‌డ్ వెజిటబుల్ సలాడ్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
వెయిట్ లాస్: అధిక బరువుతో బాధపడేవారు బరువు తగ్గడానికి రోజూ డైట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అందుకోసం మిక్స్‌డ్ వెజిటబుల్ సలాడ్ ట్రై చేయమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఈ సలాడ్ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ సలాడ్‌లోని కూరగాయలలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలి కాకుండా, అతిగా తినకుండా ఉండేలా చేస్తుందని అంటున్నారు.
2017లో "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఓబెసిటీ"లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అధిక బరువుతో బాధపడేవారు మిక్స్‌డ్ వెజిటబుల్ సలాడ్ తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగాఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని 'మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్'లో పని చేసే 'డాక్టర్. డేవిడ్ జె లెవిన్' పాల్గొన్నారు. బరువు ఎక్కువగా ఉన్న వారు మిక్స్‌డ్ వెజిటబుల్ సలాడ్ తినడం వల్ల బరువు తగ్గుతారని ఆయన అన్నారు.
- అలాగే అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ADA) నివేదిక ప్రకారం, డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ సలాడ్ తినడం వల్ల షుగర్ అదుపులో ఉంటుందట.
- ఇంకా మిక్స్‌డ్ వెజిటబుల్ సలాడ్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని, చర్మం మెరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి మిక్స్‌డ్ వెజిటబుల్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాల? దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం..