Loose Motions Home Remedy : మనం ఏదైనా కల్తీ ఫుడ్ తిన్నప్పుడు లూజ్ మోషన్స్ అవుతాయి. కడుపులో గడబిడగా ఉంటుంది. రెస్ట్ లేకుండా వాష్‌రూమ్‌కు పరుగులు తీయాల్సి ఉంటుంది. ఒంట్లో ఓపికంతా పోతుంది. నీరసంగా అనిపిస్తుంది. లూజ్ మోషన్స్‌తో ఇంకొక సమస్య ఏమిటంటే శరీరంలో నుంచి నీరు కూడా ఎక్కువ మొత్తంలో పోతుంది. ఫలితంగా బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అయితే ఈ సమస్యతో బాధపడే చాలా మంది మెడిసిన్ వాడటానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అయితే మెడిసిన్ కాకుండా ఆయుర్వేదం ప్రకారం ఈ చిట్కాలు పాటిస్తే ఈ ప్రాబ్లమ్ తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు..
నీళ్లు ఎక్కువగా తాగాలి :లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు మన శరీరం నుంచి నీరు ఎక్కువగా బయటకు వెళ్తుంది. దీనివల్ల మనకు అలసటగా ఉంటుంది. కాబట్టి, బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఎక్కువగా నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే నీళ్లలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌లను కలుపుకుని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. అదే విధంగా కొబ్బరి నీళ్లు తాగినా కూడా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
అరటి పండు :విరేచనాలతో బాధపడుతున్నప్పుడు అరటి పండు తినడం వల్ల సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో పొటాషియం అనే ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఇది తినడం వల్ల శరీరం కోల్పోయిన ద్రవాలు, ఎలక్ట్రోలైట్‌లను తిరిగి పొందేలా చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
'ఆ ఏజ్ గ్రూప్ వాళ్లకు ఎక్కువగా షుగర్, బీపీ- 50శాతం పెరిగిన మరణాలు' - Deaths With Health Issues
పెరుగు, మజ్జిగ :లూజ్ మోషన్స్‌తో బాధపడేవారు పెరుగన్నం తినడం వల్ల తొందరగా ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అలాగే భోజనం చేసిన తర్వాత, దాహంగా ఉన్నప్పుడు మజ్జిగ తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2014లో "ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. విరేచనాలతో బాధపడుతున్నవారు మజ్జిగ తాగడం వల్ల సమస్య తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. మజ్జిగ, పెరుగు రెండూ విరేచనాల సమస్యతో బాధపడేవారికి ఒక చక్కటి ఔషధంగా పని చేస్తాయని డాక్టర్ గాయత్రీ దేవి (ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, ఆరోగ్య పీఠం) చెబుతున్నారు.
అల్లం వాటర్:ఒక గిన్నెలో ఓ గ్లాసు నీళ్లు తీసుకుని అందులో అర చెంచా తరిగిన అల్లం, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి వేడి మరిగించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టి ఈ డ్రింక్ తాగితే లూజ్ మోషన్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మీరు తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అలాగే గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసుకుని తాగినా కూడా విరేచనాలకు చెక్ పెట్టొచ్చంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బిగ్ అలర్ట్ : నాన్‌స్టిక్ పాత్రలు వాడితే ఏమవుతుందో తెలుసా? - ఐసీఎంఆర్ హెచ్చరికలు! - Nonstick Cookware Side Effects
వాతావరణ మార్పులతో బ్రెయిన్‌పై తీవ్ర ప్రభావం- ఉష్ణోగ్రతలతో వారికి చాలా డేంజర్! - Climate Change Impact On brain