List Of Food Cats Cannot Eat :ఇంట్లో కుక్కలను, పిల్లులను పెంచుకోవడం ఈ మధ్య చాలా కామన్ అయింది. పెట్స్‌ను పెంచుకోవడం చాలా మంచి అలవాటు. కానీ పిల్లలను పెంచడం అనుకున్నంత ఈజీ మాత్రం కాదు. ముఖ్యంగా దానికి పెట్టే ఫుడ్స్ విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందట. పిల్లికి అస్సలు పెట్టకూడని కొన్ని ఆహరాలుంటాయట. వాస్తవానికి పిల్లులు చాలా స్మార్ట్‌గా వ్యవహరించే జంతువులు. కానీ ఫుడ్ విషయంలో మాత్రం ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోలేవు. మనమే వాటిని పర్యవేక్షిస్తూ ఏది మంచి ఆహారం ఏది కాదో కనిపెట్టుకుని ఉండాలి. ప్రమాదకరమైన వాటి జోలికి పోనివ్వకుండానే ఉంటేనే మీ పెంపుడు పిల్లి సేఫ్‌గా ఉంటుంది.
చాక్లెట్స్
పిల్లులు సహా జంతువుల్లో వేటికి కూడా చాక్లెట్స్ అనేవి ఇవ్వకూడదు. వాటిల్లో ఉండే కెఫైన్, థియోబ్రోమైన్ పిల్లులకు చాలా ప్రమాదానికి గురి చేస్తాయి. వాటి శరీరానికి హాని కలుగజేస్తాయి.
ఆల్కహాల్
పిల్లులకు ఆల్కహాల్ పట్టించారా? ఇక సమాధి కట్టేసినట్లే. పొరబాటున రెండు సిప్పులు తాగినా సరే పిల్లికి ఇబ్బందులు తప్పవు. డయేరియా, వాంతులు లాంటి ఇతర సమస్యలు పట్టి పీడిస్తాయి.
పచ్చి గుడ్లు
ఉడకబెట్టని గుడ్లను కూడా తినకూడదు. వీటిని తినడం వల్ల వాటి శరీరాల్లో మార్పులు సంభవిస్తాయి. ఫుడ్ పాయిజనింగ్, చర్మ సమస్యలు వంటివి ఎదురవుతాయి.