Is it Safe to Remove Wisdom Teeth : మనిషికి 32 పళ్లు ఉంటాయి. యుక్త వయసు వరకు 28 దంతాలే వస్తాయి. 20 సంవత్సరాల తర్వాత ఎగువ, దిగువ దవడలలో రెండు కొత్త దంతాలు వస్తూ ఉంటాయి. వీటినే జ్ఞాన దంతాలని అంటారు. ఇక జ్ఞానదంతాలు వచ్చేప్పుడు విపరీతమైన నొప్పి కలుగుతుంది. మరి.. జ్ఞానదంతాలు వచ్చేప్పుడు నొప్పి ఎందుకు వస్తుంది? ఆ దంతాలు తీయించుకోవడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
నొప్పి ఎందుకు వస్తుంది..?జ్ఞానదంతాల్లో నొప్పి రావడానికి మన శరీర ఎదుగుదల ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. చిన్నతనంలో దవడలో జ్ఞానదంతం మొలవటానికి అవసరమైనంత చోటుండదు. అందుకే.. వయసుతోపాటు దవడ సైజూ పెరుగుతూ వస్తుందని, తగినంత సైజు పెరిగాక జ్ఞానదంతం రావడం స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. అయితే.. కొందరిలో ఈ దవడ సైజు అవసరమైనంత పొడవుగా పెరగదు. అలాంటి వారికి నొప్పి వస్తుందని అంటున్నారు.
మన పూర్వీకులు గట్టి గట్టి గింజలు, గింజపప్పులు, పచ్చి కూరగాయలు, మాంసం వంటి కఠినమైన పదార్థాలు తినేవారు. దీంతో చిన్నప్పుడే దవడ పొడవుగా పెరిగేది. కాలం గడిచే కొద్దీ.. మెత్తటి పదార్థాలు తినటం మొదలైంది. దీంతో దవడ పెరుగుదల ఆలస్యమవుతూ వచ్చింది. యుక్తవయసు వచ్చేంతవరకు జ్ఞానదంతం అవసరం లేకపోవటం కూడా ఇది ఆలస్యంగా రావటానికి కారణమేనని అంటున్నారు. కొన్నిసార్లు దవడ మీద పలువరస ఉండే స్థలంపై మిగతా దంతాలన్నీ కాస్త విడివిడిగా వస్తే.. జ్ఞానదంతం దశ, దిశ మారుతుందని కూడా చెబుతున్నారు.
జ్ఞానదంతం తొలగించొచ్చా..?: జ్ఞానదంతం నొప్పి కలిగితే వెంటనే తొలగించాలని చాలా మంది భావిస్తారు. అయితే.. ప్రతిసారీ తొలగించాల్సిన అవసరం లేదంటున్నారు. ఆ దంతం పూర్తిగా బయటకు ఎదిగే అవకాశాలున్నప్పుడు దాన్ని తొలగించడం సరికాదంటున్నారు. పూర్తిగా బయటకు రాకుండా, కొద్దిగా మాత్రమే బయటకు కనిపిస్తూ, నమలడానికీ, నోటి ఆరోగ్యానికీ ఇబ్బందిగా మారినప్పుడు మాత్రమే దానిని తీయాలని సూచిస్తున్నారు.
జ్ఞానదంతం ఎదుగుతున్నప్పుడు వచ్చే సమస్యలు ఇవే: జ్ఞానదంతాలు చిగురును చీల్చుకు వచ్చే సమయంలో కలిగే నొప్పి, వాపు, ఆ భాగం ఎర్రబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్నిసార్లు చిగుర్ల వరస నుంచి చీము నొప్పి కారణంగా మెడ వద్ద ఉండే లింఫ్ గ్రంథులు ఉబ్బుతాయి. కొన్నిసార్లు జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆహారాన్ని మింగడంలోనూ ఇబ్బందులు ఉంటాయి.
దంతాలు విరిగిపోతున్నాయా? ప్రధాన కారణాలు ఇవేనట!
జ్ఞానదంతాలు తొలగించినప్పుడు వచ్చే సమస్యలు:జ్ఞానదంతాలు తొలగించినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయని NIH బృందం వెల్లడించింది. (National Library of Medicine రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అయితే.. అవి సాధారణంగా తాత్కాలికమైనవేనని పేర్కొంది. ఈ సమస్యలు ప్రతి వ్యక్తికీ భిన్నంగా ఉండవచ్చని కూడా నిపుణులు తెలిపారు. ఆ సమస్యలు చూస్తే..