తెలంగాణ

telangana

ETV Bharat / health

షుగర్​ పేషెంట్లు ఖర్జూరాలు తింటే మంచిదేనా? - నిపుణులు సమాధానమిదే! - Is Dates Good for Diabetes Patients - IS DATES GOOD FOR DIABETES PATIENTS

Dates: ఖర్జూరాలు.. డ్రైఫ్రూట్స్​లో వన్​ ఆఫ్​ ది బెస్ట్​. వీటిలో తాజా పండ్ల కంటే ఎక్కువ కేలరీలు ఉంటాయి. మన శరీరంలోని కణాలకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు సైతం వీటిలో మనకు పుష్కలంగా లభిస్తాయి. అయితే వీటి తియ్యదనం కారణంగా షుగర్​ పేషెంట్లు డేట్స్​ను తినడానికి ఆలోచిస్తుంటారు. ఇంతకీ షుగర్​ పేషెంట్లు వీటిని తినొచ్చో?లేదో? ఈ స్టోరీలో చూద్దాం..

Diabetes Patients
Is Dates Good for Diabetes Patients (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Aug 29, 2024, 1:16 PM IST

Updated : Sep 14, 2024, 6:59 AM IST

Is Dates Good for Diabetes Patients?ఖర్జూర పండును చూడగానే నోరూరుతుంది. ఇది రుచికరమైందే కాదు, ఆరోగ్యదాయిని కూడా. దీనిలోని పోషకాలు పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అందుకే చాలా మంది వీటిని స్నాక్స్​ రూపంలో తింటుంటారు. అయితే చాలా మంది డేట్స్​ తిన్నా.. షుగర్​ బాధితులు వీటిని తినాలంటే కాస్తా ఆలోచిస్తారు. ఎందుకంటే వీటిలో సహజంగానే చక్కెర ఉంటుంది. ఈ చక్కెర కారణంగా రక్తంలో గ్లూకోజ్​ లెవల్స్​ పెరుగుతాయని వెనకడుగు వేస్తుంటారు. ఇంతకీ షుగర్​ పేషెంట్లు వీటిని తినొచ్చో?లేదో? ఈ స్టోరీలో చూద్దాం..

షుగర్​ పేషెంట్లు ఖర్జూరాలు తినొచ్చా:సహజంగా తీపి కలిగిన ఖర్జూరాలను చాలా మంది చక్కెరకు బదులుగా తీసుకుంటారు. ఇక షుగర్​ పేషెంట్లు కూడా ఖర్జూరాలను తినొచ్చని నిపుణులు అంటున్నారు. ఇతర ఆహారాలతో పోలిస్తే, ఖర్జూరాలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయని.. అలాగే ఫైబర్ పుష్కలంగా ఉంటుందని అంటున్నారు. ఇవి రక్తంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుందని.. రక్తంలో షుగర్​ లెవల్స్​(National Library of Medicine రిపోర్ట్​)పెరగకుండా చేస్తాయని వివరిస్తున్నారు. అయితే మంచిది కదా అని ఎక్కువ తీసుకోకుండా మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

2018లో జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఖర్జూరాన్ని 12 వారాల పాటు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని.. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో హెచ్‌బిఎ1సి స్థాయిలు తగ్గుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బంగ్లాదేశ్​ ఢాకాలోని బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్​ డాక్టర్​ మహ్మద్ M. అల్-మమున్ పాల్గొన్నారు. ఇవి మాత్రమే కాకుండా డేట్స్​ తినడం వలన మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటంటే..

తక్షణ శక్తి: ఖర్జూరాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్‌లన్నీ కలిసి కార్బోహైడ్రేట్స్‌ని ఏర్పరుస్తాయని.. వీటిని తింటే బలం అందుతుందని నిపుణులు అంటున్నారు. బాగా అలసిపోయాక, వర్కౌట్ చేసిన తర్వాత వీటిని తింటే తక్షణ శక్తి లభిస్తుందని వివరిస్తున్నారు.

ఎముకల ఆరోగ్యం: కాల్షియం, మెగ్నీషియం, కాపర్.. వంటి ఖనిజాలు ఈ పండులో అధికంగా లభిస్తాయి. క్యాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడానికి.. కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి.. మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయని సూచిస్తున్నారు.

షుగర్​ బాధితులు ఇడ్లీ, దోశలకు మినప పప్పును వాడుతున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

బరువు తగ్గొచ్చు: ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువగా.. ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి తింటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగి.. బరువు అదుపులో ఉంచుకోవచ్చు. అయితే ఇవి కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. బాగా సన్నగా ఉండి బరువు పెరగాలనుకునే వారికీ మంచి ఫలితాన్నిస్తాయని అంటున్నారు.

మలబద్ధకం పరార్​: ఖర్జూరాల్లో పీచు అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, ఎసిడిటీ.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకంతో బాధపడేవారు కొన్ని ఖర్జూరాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని తిని, ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు.

క్యాన్సర్ల నుంచి రక్ష: బీటా కెరటిన్‌, ల్యుటీన్‌, జియాగ్జాంతిన్‌ అనే రుచికారక యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్​ను అడ్డుకుంటాయని.. తద్వారా పెద్దపేగు, ప్రోస్టేట్‌, రొమ్ము, ఎండోమెట్రియల్‌, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ల నుంచి కొంతవరకు రక్షిస్తాయని అంటున్నారు. జియాగ్జాంతిన్‌ వృద్ధాప్యంలో రెటీనాలోని మాక్యులా క్షీణించకుండానూ కాపాడుతుందని చెబుతున్నారు.

గుండెకు మంచిది: కణాలకు పొటాషియం అత్యవసరం. ఇది ఖర్జూరంలో దండిగా ఉంటుంది. ఒంట్లో ద్రవాలు, గుండెలయ, రక్తపోటు నియంత్రణలోనూ పొటాషియం పాలు పంచుకుంటుందని.. ఇలా గుండె, మెదడు వంటి కీలక అవయవాలకూ ఖర్జూరం మేలు చేస్తుంది.

మూత్రపిండాల్లో రాళ్లు మాయం: మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరగాలంటే ఖర్జూరాల్ని తరచూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కొంతమందికి మూత్రం సరిగ్గా రాకపోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు.. తదితర సమస్యలుంటాయి. ఇవన్నీ ఖర్జూరం తినడం వల్ల తగ్గే అవకాశం ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.

షుగర్ బాధితులు పాలు తాగొచ్చా? - పరిశోధనలో కీలక విషయాలు!

అలర్ట్ : షుగర్, గుండె పోటు, ఊబకాయం - ఇవి​ రావడానికి కారణం తెలిసిపోయింది!

డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగితే ఏం జరుగుతుంది? - పరిశోధనలో తేలిందిదే!

Last Updated : Sep 14, 2024, 6:59 AM IST

ABOUT THE AUTHOR

...view details