తెలంగాణ

telangana

మీ ఇంట్లో కబోర్డులు, షెల్ఫ్​లు దుర్వాసన వస్తున్నాయా? - ఇవి వేలాడదీస్తే చాలు - సూపర్ ఫ్రెష్​గా ఉంటాయి! - Hanging Dehumidifier For Wardrobe

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 11:42 AM IST

Dehumidifier For Wardrobe : వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల కబోర్డుల్లో ఉంచిన దుస్తుల నుంచి ఒకరకమైనటువంటి దుర్వాసన వస్తుంటుంది. అయితే, ఈ బ్యాడ్​ స్మెల్​ని తొలగించే ఒక అద్భుతమైన ప్రొడక్ట్​ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Dehumidifier
Dehumidifier For Wardrobe (ETV Bharat)

How To Prevent Bad Smell clothes In Monsoon :వర్షాకాలంలో తరచూ కురిసే చిరుజల్లులు, భారీ వర్షాల కారణంగా రెండు మూడు రోజులైనా బట్టలు పూర్తిగా ఆరిపోవు. పైకి చూడడానికి పూర్తిగా ఆరినట్లు కనిపించినా కూడా లోపల కాస్త తడిగానే ఉంటాయి. అయితే, చాలా మంది దుస్తులను అలానే మడతపెట్టి కబోర్డుల్లో పెడుతుంటారు. దీనివల్ల దుస్తులపై ఫంగస్​ చేరి ఒకరకమైనటువంటి బ్యాడ్​ స్మెల్​ వస్తుంటుంది.

అలాగే మనం వాటిని ధరించడం వల్లబ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్​ సోకే అవకాశం కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో దుస్తుల నుంచి దుర్వాసన రావడానికి, వాటిపై ఫంగస్​ చేరడానికి కబోర్డుల్లో తేమ ఉండడం ప్రధాన కారణం. అయితే, కబోర్డుల్లో తేమని పీల్చుకునే ఒక సూపర్​ ప్రొడక్ట్​ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతోంది. ఇంతకీ ఆ ప్రొడక్ట్​ ఏంటో మీకు తెలుసా ? ఈ స్టోరీలో చూద్దాం..

వర్షాకాలంలో కబోర్డుల్లోని తేమను పీల్చుకోవడానికి 'డీ హ్యుమిడిఫయర్లు' చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఇవి ఆన్​లైన్​ స్టోర్స్​లో, అలాగే షాపుల్లో లభిస్తున్నాయి. డీ హ్యుమిడిఫయర్లు బ్యాగులూ, చిన్న చిన్న బాక్సుల రూపంలో దొరుకుతున్నాయి. అయితే, వీటిని మీరు కొనుగోలు చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే.. బ్యాగులైతే ఒకసారి వాడిపడేయొచ్చు. కానీ, మీరు తర్వాత కూడా ఉపయోగించాలనుకుంటే.. బాక్సులను ఎంపిక చేసుకోండి.

ఈ డీ హ్యుమిడిఫయర్లలో ఉండే కాల్షియం క్లోరైడ్‌ గ్రాన్యుల్స్‌ పౌచ్‌లు కబోర్డుల్లో ఉండే గాలిలోని తేమను పీల్చుకుంటాయి. తర్వాత కొన్నిరోజులకు కరిగి నీరుగా మారి, కింద ఉండే సంచి లేదా మూతలోకి వచ్చేస్తాయి. మూతలోకి చేరిన నీటిని పారబోసి తర్వాత కూడా వాడొచ్చు. గది ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా డీ హ్యుమిడిఫయర్​ బ్యాగులు దాదాపు 75 రోజుల వరకూ పని చేస్తాయట. అయితే, వీటిని కబోర్డుల్లో ఈజీగా పెట్టడానికి ఒక హుక్​ ఉంటుంది. దీంతో ఈజీగా కిచెన్​, బాత్​రూమ్​, బెడ్​రూమ్​ల్లో కూడా ఎక్కడైనా తగిలించొచ్చు.

వర్షాకాలంలో దుస్తులు దుర్వాసన రాకుండా ఇలా చేయండి :

  • ప్రతిరోజు కనీసం ఒక 15 నిమిషాలు కబోర్డు డోర్స్​ ఓపెన్​ చేయండి.
  • అలాగే బట్టలు పూర్తిగా ఆరిన తర్వాత.. వీలైతే ఐరన్​ చేసి కబోర్డులో పెట్టండి.
  • రెండు వారాలకు ఒకసారి కబోర్డుని శుభ్రం చేయండి.
  • ఈ టిప్స్​ పాటించడం ద్వారా వర్షాకాలంలో బట్టలు దుర్వాసన రాకుండా జాగ్రత్త పడొచ్చంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి:

సూపర్​ ఐడియా : వర్షాకాలంలో ఇల్లంతా బ్యాడ్​ స్మెల్​ వస్తోందా ? ఇంట్లోనే రూమ్​ ఫ్రెష్​నర్స్ రెడీ చేసి స్ప్రే చేసేయండి!​

కిచెన్‌ ఎంత క్లీన్ చేసినా అదో రకమైన స్మెల్ వస్తుందా? ఈ టిప్స్ పాటిస్తే అంతా సెట్!

వర్షాకాలంలో దోమలకు మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్ వద్దు - ఇలా చేస్తే ఒక్క దోమ కూడా కుట్టదు!

ABOUT THE AUTHOR

...view details