How To Make Room Fresheners At Home :ఇంట్లోకి గాలి సరిగ్గా ప్రసరించకపోవడం, ఇల్లు క్లీనింగ్ లేకపోవడం వంటి కారణాల వల్ల అప్పుడప్పుడూ ఇంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. అలాగే వర్షాకాలంలో ఇంట్లో దుస్తులు ఆరేసుకోవడం వల్ల లేదా ఇతర కారణాలతో కూడా ఇల్లంతా దుర్వాసనతో నిండిపోతుంది. అయితే, మెజార్టీ జనాలు చెడు వాసనలను తొలగించడానికి మార్కెట్లో దొరికే ఖరీదైనా రూమ్ ఫ్రెష్నర్స్ వాడుతుంటారు. వీటిని వివిధ కెమికల్స్‌తో తయారు చేస్తారు. కాబట్టి, తరచుగా రూమ్ ఫ్రెష్నర్స్ వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇంట్లోనే కొన్ని పదార్థాలను యూజ్ చేసి రూమ్ ఫ్రెష్నర్స్ని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఎసెన్షియల్ ఆయిల్స్‌తో :గులాబీ, లావెండర్, లెమన్ గ్రాస్, టీ ట్రీ వంటి అనేక రకాల సువాసనలను వెదజల్లే ఎసెన్షియల్ ఆయిల్స్ ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. ఇందులో మీకు ఏ సువాసన ఇష్టమైతే దానిని ఎంపిక చేసుకుని.. స్ప్రే బాటిల్లో నీళ్లు పోసి.. కొన్ని చుక్కల ఆయిల్‌ని కలపండి. వాటర్ నుంచి మంచి సువాసన వచ్చినప్పుడు ఇంట్లో స్ప్రే చేసుకుంటే సరిపోతుంది.
నిమ్మ, నారింజ తొక్కలతో :ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీళ్లను పోసి.. నిమ్మ, నారింజ తొక్కలు, పుదీనా ఆకులు వేసి మరిగించాలి. బాగా మరిగించిన తర్వాత ఆ నీటిని చల్లార్చి.. వడకట్టి స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. తర్వాత ఇల్లంతా స్ప్రే చేస్తే సరిపోతుంది. నాచురల్‌గా ఇలా బ్యాడ్ స్మెల్ని దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గులాబీలతో :గులాబీల వాసనంటే అందరికీ ఇష్టం. అయితే, ఈ సువాసన వచ్చే రూమ్ ఫ్రెష్‌నర్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కప్పు నీటిలో గులాబీ రేకులను, బేకింగ్ సోడా వేసి కొద్దిగా వేడి చేయండి. తర్వాత ఈ నీటిని వడకట్టి స్ప్రే బాటిల్లో పోసుకోండి. రూమ్‌లో నుంచి దుర్వాసన వచ్చినప్పుడు స్ప్రే చేస్తే సరిపోతుంది.
లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ :వాటర్‌లో కొద్దిగా లెమన్ ఎసెన్షియల్ నూనె, పెప్పర్మింట్ ఆయిల్ వేసుకుని కూడా మరిగించుకోవచ్చు. దీనిని స్ప్రే బాటిల్లో పోసుకుని వాడుకోవచ్చు.