తెలంగాణ

telangana

ETV Bharat / health

సిక్స్ ప్యాక్‌ కోసం జిమ్​కే వెళ్లాల్సిన పనిలేదు - ఇంట్లో ఈ వర్కవుట్స్‌ చేస్తే చాలు! - How To Get Six Pack At Home

How To Get Six Pack At Home : మీరు సిక్స్‌ప్యాక్‌ బాడీ కావాలని కోరుకుంటున్నారా? దీనికోసం డైలీ జిమ్‌కే వెళ్లాల్సిన పనిలేదని చెబుతున్నారు నిపుణులు. ఇంట్లోనే కొన్ని ఎక్సర్‌ సైజ్‌లు చేస్తే.. సిక్స్‌ ప్యాక్‌ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆ వ్యాయామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Get Six Pack At Home
How To Get Six Pack At Home

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 10:29 AM IST

How To Get Six Pack At Home : నేటి ఆధునిక ప్రపంచంలో సిక్స్‌ ప్యాక్‌ బాడీ ఉండాలని యూత్​లో చాలా మంది కోరుకుంటున్నారు. దీనికోసం జిమ్​కు వెళ్లి నచ్చిన వర్కవుట్స్ చేస్తుంటారు. కానీ.. ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే.. ఇంట్లోనే సిక్స్ ప్యాక్ సాధించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

బరువు తగ్గే వర్కవుట్స్‌..
పొట్ట ఎక్కువగా ఉన్న వారు ముందుగా దాన్ని తగ్గించుకోవడానికి కార్డియో వర్కవుట్స్‌ చేయాలని చెబుతున్నారు. అవేంటంటే రన్నింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలను చేయాలని సూచిస్తున్నారు. వీటిని కొన్ని రోజులు చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట! ఆ తర్వాత ఇంట్లోనే సిక్స్‌ ప్యాక్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలని అంటున్నారు.

సిక్స్‌ ప్యాక్ ఎక్సర్‌సైజ్‌లు..
సిక్స్‌ ప్యాక్ రావడానికి రోజూ అబ్డామినల్‌ మజిల్‌ ఎక్సర్‌సైజ్‌ చేయాలి. అవేంటంటే రెక్టస్ అబ్డోమినిస్ (rectus abdominis), ఆబ్లిక్స్ (obliques), ట్రాన్స్‌వర్స్ అబ్డోమినిస్‌ (transverse abdominis) వంటి ఎక్సర్‌సైజ్‌లను చేయాలి. అలాగే ప్లాంక్స్‌ (planks), క్రంచెస్ (crunches), లెగ్ రైజ్‌లు (leg raises), రష్యన్ ట్విస్ట్‌లు (Russian twists), సైకిల్ క్రంచెస్‌ (bicycle crunches) వంటివి క్రమం తప్పకుండాచేయడం వల్ల సిక్స్‌ ప్యాక్‌ను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • ఇంకా రోజూ పుష్-అప్స్, పుల్-అప్‌లు కూడా ఇంట్లో చేయాలని సూచిస్తున్నారు.
  • అలాగే క్యాలరీలను ఎక్కువ కరిగించే burpees, mountain climbers వంటి ఎక్సర్‌ సైజ్‌లను కూడా చేయాలని సూచిస్తున్నారు.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

  • సిక్స్‌ ప్యాక్‌ బాడీని సొంతం చేసుకోవాలని అనుకునే వారు ఆహారంలో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
  • మీరు బర్న్‌ చేసే క్యాలరీల కంటే తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
  • కండరాలు బలంగా ఉండటానికి, పెరగడానికి ప్రొటీన్‌ ఎంతో అవసరమవుతుంది. ఇందుకోసం చికెన్‌, చేపలు, చిక్కుళ్లు, గుడ్లు వంటి ఆహారాలను రోజూ డైట్‌లో భాగం చేసుకోవాలి.
  • వీటిని తినడం వల్ల వర్కవుట్స్‌ చేయడానికి తగినంత శక్తి లభించడంతో పాటు ఆకలి కాకుండా ఉంటుందట.
  • వర్కవుట్స్‌ చేసేటప్పుడు శరీరంలోని నీరు చాలా వరకు చెమట రూపంలో బయటకు పోతుంది. అందుకే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి రోజుకు కనీసం 10 గ్లాసుల నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • అలాగే జంక్​ ఫుడ్, ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌గా పూర్తి దూరంగా ఉండాలి.
  • చక్కెర, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. వీటివల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
  • ఎక్కువ శారీరక శ్రమను కలిగించే ఎక్సర్‌సైజ్‌లను చేసినప్పుడు బాడీ అలసిపోతుంది. తిరిగి మరుసటి రోజు వర్క్‌ అవుట్స్‌ చేయాలంటే శక్తి కావాలి. కాబట్టి.. కనీసం 8 గంటలు నిద్ర పోవాలని సూచిస్తున్నారు.
  • లాగే ఎక్సర్‌సైజ్‌లు చేసేటప్పుడు మానసిక ఒత్తిడి చాలా మందిని వేధిస్తుంది. దీనివల్ల పూర్తిగా వర్క్ అవుట్స్‌ పై శ్రద్ధ పెట్టలేకపోవచ్చు.
  • అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజూ యోగా, ధ్యానం వంటి వాటిని అలవాటు చేసుకుంటే మంచిది.
  • ఇలా వ్యాయామాలను చేస్తూనే, మంచి డైట్‌ను రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సిక్స్‌ ప్యాక్ బాడీ వస్తుందట!

నీళ్లు తక్కువ తాగితే కిడ్నీలకు డేంజర్ - మరి ఎక్కువగా తాగితే?

బ్రేక్​ఫాస్ట్​లో ఇవి తింటే - వారం రోజుల్లో రెండు కేజీల బరువు తగ్గడం గ్యారెంటీ!

స్టైలిష్​ లుక్​ కోసం హెయిర్​కు కలర్​ వేసుకుంటున్నారా ? ఈ టిప్స్​ పాటిస్తే ఎక్కువ రోజులు నిగనిగలాడుతుంది!

ABOUT THE AUTHOR

...view details