How To Clean Kitchen Sink : ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు కిచెన్‌లో ఏదో ఒక వంట చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తిన్నప్లేట్లు, తాగిన గ్లాసులు, బౌల్స్.. ఇలా ఏది కడగాలన్నా సింక్ ముఖ్యం. అయితే సింక్ క్లీన్‌గా ఉంటే ఎన్ని గిన్నెలైనా కడగడానికి ఈజీగా ఉంటుంది. అదే సింక్‌లో నీరు పోకుండా జామ్ అయినప్పుడే అసలు చిరాకు మొదలువుతుంది. దీనికి కారణం పాత్రలు కడిగినప్పుడు అందులోని చిన్న చిన్న వ్యర్థాలు సింక్ పైపులో పేరుకుపోవడమే. మరి మీరు కూడా పదేపదే సింక్‌లో వాటర్ నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే, ఈ స్టోరీ మీ కోసమే! కొన్ని చిట్కాలను పాటించడం వల్లఈజీగా సింక్‌లో వాటర్ నిలిచిపోకుండా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేడి నీళ్లు:సింక్‌ను ఈజీగా క్లీన్ చేయడానికి ఏదైనా మార్గం ఉందంటే, అది వేడి నీళ్లే. అవును మీరు విన్నది నిజమే. హాట్ వాటర్ సాయంతో సింక్ పైపులో ఇరుక్కుపోయినా వేస్ట్ మొత్తం క్లీన్ అవుతుంది. దీని కోసం ముందుగా ఒక పెద్ద గిన్నెలో నీటిని వేడి చేసుకోండి. ఆ తర్వాత జాగ్రత్తగా నీటిని సింక్‌లో పోయండి. ఇలా మూడు నుంచి నాలుగు సార్లు చేయడం వల్ల సింక్ పైపులో పేరుకుపోయిన వ్యర్థాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ వేడి నీళ్లను పోయడం వల్ల జిడ్డు కూడా తొలగిపోతుంది.
బేకింగ్ సోడా, వెనిగర్:సింక్‌లో నీళ్లు నిలిచిపోకుండా ఉండటానికి బేకింగ్ సోడా, వెనిగర్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఎలాగంటే ముందుగా ఓ కప్పు వాటర్‌లో సగం కప్పు బేకింగ్ సోడా, సగం కప్పు వెనిగర్‌ను పోసుకుని మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సింక్‌లో పోయాలి. అలా 15 నిమిషాలు పూర్తైన తర్వాత మళ్లీ వేడి నీటిని పోయాలి. ఇలా రెండు మూడు సార్లు వేడి నీటిని సింక్‌లో పోయాలి. అంతే సింక్ పైపులో ఉన్న వ్యర్థాలు అన్నీ ఈజీగా తొలగిపోతాయి.
ప్లంగర్ ఉపయోగించండి:ప్రస్తుతం అందరి ఇళ్లలోనూ ప్లంగర్ ఉంటుంది. అయితే ఇది కూడా సింక్‌ను క్లీన్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మంది ఇది కేవలం టాయిలెట్ల కోసమే అనుకుంటారు. కానీ, ఈ ప్లంగర్‌ను కిచెన్ సింక్‌లలో వ్యర్థాలను తొలగించడానికి కూడా ఉపయోగించవచ్చు. ప్లంగర్‌తో పంప్ చేయడం వల్ల కూడా సింక్‌లోని వ్యర్థాలు తొలగిపోయి క్లీన్ అవుతుంది.