How Much Should a Diabetic Walk a Day:ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల చిన్నా పెద్దా తేడా లేకుండా డయాబెటిస్ అందరికీ వ్యాపిస్తుంది. అయితే, రోజు వాకింగ్ చేయడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండాలంటే రోజుకు ఎంత సేపు నడవాలి? వారానికి ఎంత సమయం కేటాయించాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ రోగులు వారానికి సుమారు 150 నిమిషాలు నడవాలని నిపుణులు చెబుతున్నారు. Diabetes Care జర్నల్లో ప్రచురితమైన Stepping Up to Diabetes The Power of Walking అనే అధ్యయనంలో తేలింది. ఇందులో American Diabetes Association చెందిన పరిశోధకులు పాల్గొన్నారు. వారంలో కనీసం అయిదు రోజుల పాటు రోజుకి 30 నిమిషాలు నడిస్తే మంచిందని వివరించారు.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఒకవేళ రోజులో ఒకేసారి అరగంట వాకింగ్ చేసేందుకు సమయం లేని వారు దాన్ని భాగాలుగా విభజించుకోవాలని చెబుతున్నారు. వాకింగ్ చేసినప్పుడల్లా 10 నిమిషాలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. వాకింగ్ చేసే సమయంలో గంటకు మూడు నుంచి నాలుగు మైళ్ల వేగంతో నడిస్తే ఇన్సులిన్ స్థాయులు పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఆహారం తేలికగా జీర్ణం అయ్యేందుకు వీలుగా భోజనం అనంతరం పది నిమిషాలు షార్ట్ వాక్ చేయాలని అంటున్నారు. అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అనంతరం కనీసం పది నుంచి 15 నిమిషాలు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయని చెబుతున్నారు. ఇంకా కనీసం రోజుకు 5వేల అడుగులు వేసేందుకు ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత వాటిని 7వేల నుంచి 10వేలకు పెంచాలని సూచించారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో అనారోగ్యాలు దరిచేరుకుండా ఉంటాయని వివరించారు.