తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 10:46 AM IST

ETV Bharat / health

టేస్టీ​గా ఉందని సాస్​ లాగించేస్తున్నారా? - మీ శరీరంలో జరిగేది ఇదే!

Hot Sauce Benefits: సాస్​ అంటే చాలా మందికి ఇష్టం. నూడుల్స్ నుంచి సమోసాల దాకా అన్నింటి మీదా వేసుకొని లాగిస్తుంటారు. మార్కెట్లో రకరకాల సాస్​లు అందుబాటులో ఉన్నాయి. అందులో హాట్​ సాస్​ ఒకటి. మరి.. దీన్ని తినడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా?

Hot Sauce Benefits
Hot Sauce Benefits

Hot Sauce Health Benefits and Side Effects:సాస్​ వాడకం ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయింది. ఫాస్ట్ పుడ్ ఐటమ్ ఏది తిన్నా.. అందులో సాస్ వేసుకొని లాగిస్తుంటారు. మార్కెట్లో రకరకాల సాస్​లు అందుబాటులో ఉన్నాయి. అందులో.. వేడి సాస్‌లు, స్వీట్ సాస్‌లు, టాంగీ సాస్‌లు ఆహారానికి మరింత రుచిని కలిగిస్తాయి. అయితే.. ఏ సాస్ వాడితే మంచిదనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. స్వీట్​ సాస్​ కన్నా హాట్ సాస్ మంచిదని కొందరు అంటున్నారు. మరికొందరేమో అది ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. మరి.. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఏది బెటర్?

స్వీట్​ సాస్ కంటే హాట్​ సాస్ మంచిదని.. మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ రసాయనం మసాలా టేస్ట్​ను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది తిన్నప్పుడు నోరు కాస్త మంటగా అనిపించినా.. ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. సాస్​ ఏదైనా అతిగా తింటే, ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మోతాదులో తీసుకుంటే మంచిదని అంటున్నారు.

రక్తపోటు తగ్గుదల..

మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ సాస్​ను రెగ్యులర్​గా తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా.. ఆర్థరైటిస్‌ను నయం చేయడం, మైగ్రేన్, కీళ్ల నొప్పులను తగ్గించడంలోనూ ఇది సాయపడుతుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుందట.

మీరు ఎప్పుడైనా ఎల్లో టీ తాగారా? - ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఈసారి మిస్​ అవ్వరు!

ప్రయోజనకరమైన విటమిన్లు..

మిరపకాయలో విటమిన్లు A, C, B6, K, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉన్నాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జలుబు, వైరల్ ఫ్లూ, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఇది రక్షిస్తుంది.

బరువు తగ్గడంలో..

హాట్​సాస్​లో అనవసరమైన కేలరీలు, ప్రొటీన్లు, కొవ్వులు ఉండవు. ఇక మిరపకాయలోని క్యాప్సైసిన్ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది కేలరీలను మరింత సమర్థవంతంగా బర్న్ చేయడంలో హెల్ప్​ అవుతుంది.

ఇతర ప్రయోజనాలు..

  • అలర్జీ లక్షణాలను నివారిస్తుంది.
  • గాయాలను వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది
  • కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
  • నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.
  • ఎండార్ఫిన్‌లు, డోపమైన్‌లను విడుదల చేస్తుంది.

డైలీ బ్లూబెర్రీలు తింటున్నారా? మీ బాడీలో జరిగే మార్పులివే!

వేడి సాస్ ప్రతికూలతలు..

ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. కాబట్టి హాట్​ సాస్​ను కూడా పరిమితికి మించి తీసుకోకూడదు. వేడి సాస్ ఎక్కువగా తీసుకుంటే అది పలు దుష్ప్రభావాలకు కారణం అవుతుందని అంటున్నారు.

గుండెపోటు:వేడి సాస్‌లోని అధిక సోడియం రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఇది గుండెపోటుకు దారి తీస్తుంది.

గ్యాస్ట్రిక్:హాట్​ సాస్​ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లం ఉప్పగా మారుతుంది. ఇది గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లెక్స్‌ను కలిగించడమే కాకుండా జీర్ణవ్యవస్థకు సమస్యలను కలిగిస్తుంది.

హాట్​ సాస్ ఎప్పుడు తినాలి ?

వేడి సాస్‌లను ప్రొటీన్ ఆహారాలు, ఇంకా ఉప్పు చాలా తక్కువగా ఉన్న తాజా ఆహారాలతో కలపి తీసుకోవచ్చు. అయితే.. మీ బాడీలో సోడియం లెవల్స్​ను తగ్గించుకోవాలని చూస్తున్నట్లైతే వేడి సాస్ తినకపోవడం మంచిది. అధిక సోడియం ఇప్పటికే గుండె సమస్యలు ఉన్న వ్యక్తులపై ఎఫెక్ట్ చేస్తుంది. గుండెపోటు, మూత్రపిండాలు లేదా కాలేయ వైఫల్యం వంటి వ్యాధులు ఉన్నవారు వారు ఎంత హాట్​ సాస్​ తీసుకోవాలో వైద్యుడిని అడిగితే మంచిది. మీకు గ్యాస్ట్రిక్ సమస్య, కడుపునొప్పి, డయేరియా సమస్య ఉంటే ఎక్కువగా కాకుండా కొద్దిగా హాట్​ సాస్ తీసుకోవచ్చు.

మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - అయితే డయాబెటిస్ కావొచ్చు!

ఎంత తినాలి ?

ప్రతి ఆహారమూ అందరికీ సరిపడకపోవచ్చు. కాబట్టి హాట్​ సాస్ తిన్న తర్వాత మీకు ఏమైనా ఆరోగ్య సమస్య ఉందా అని చెక్ చేసుకోండి. ప్రతికూల ప్రభావాలు లేనట్లయితే మీరు తట్టుకోగలిగినంత ఎక్కువగా తినవచ్చు. ఒకవేళ మీకు ఈ సాస్​ తిన్న తర్వాత గుండెల్లో మంట, కడుపు నొప్పి, విరేచనాలు లేదా అనోరెక్టల్ అసౌకర్యం వంటి ప్రతికూల ప్రభావాలను గమనించినట్లయితే.. దీనికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మహిళల్లో లోయర్ బ్యాక్​ పెయిన్​ - ఎందుకొస్తుంది? ఎలా రిలీఫ్‌ పొందాలి?

ABOUT THE AUTHOR

...view details